Lenin Movie Success Meet: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో, సంచలన విజయంతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఘనంగా 'లెనిన్ సక్సెస్ మీట్' కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ ఈవెంట్‌కు హాజరైన చిత్ర కథానాయిక భాగ్యశ్రీ బోర్సే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సక్సెస్ మీట్ వేదికగా భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “ఈ రోజు నా మనసు ఎంతో భావోద్వేగంతో నిండిపోయింది. అందుకే నా హృదయంలోని మాటలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఈ రోజు ఇక్కడ ఇంతటి సంతోషంతో నిలబడటానికి ముఖ్య కారణం మా దర్శకుడు మురళి కిశోర్ గారే. ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఆయన నాపై నమ్మకంతో ‘భారతి’ అనే అద్భుతమైన పాత్రను ఇవ్వకపోయి ఉంటే.. ఈ రోజు నాకు ఇంతటి పేరు, ప్రశంసలు దక్కేవి కావు. నన్ను నమ్మి ఆ పాత్రలో తెరపై అంత అందంగా చూపించినందుకు దర్శకుడికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని కొనియాడారు.
Bhagyashree Borse gets emotional at the ‘Lenin’ movie success meet!
Lenin Movie Success Meet: నువ్వు ఈ విజయానికి అర్హుడివి అఖిల్
ఆ తర్వాత హీరో అఖిల్ అక్కినేని గురించి చెప్తూ అఖిల్.. ఈ సినిమా కోసం నువ్వు ఎంతగా కష్టపడ్డావో సెట్‌లో నీ పక్కనే ఉండి నేను కళ్లారా చూశాను. గత పదేళ్లుగా టాలీవుడ్‌లో నీ జర్నీ నాకు పూర్తిగా తెలియకపోయినా.. మనం అనుకున్న ఫలితాలు రానప్పుడు ఒక నటుడిగా మనసు ఎంతగా విలవిల్లాడుతుందో నేను ఊహించగలను. ఈ సినిమా కోసం నువ్వు రక్తం, చెమట, కన్నీళ్లు చిందించి పనిచేశావు. షూటింగ్ సెట్‌లో నువ్వు ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోవడం నేను చూడలేదు. ప్రతి సీన్ పర్ఫెక్ట్‌గా రావాలని తపించేవాడివి. నువ్వు ఈ రోజు అందుకుంటున్న ఈ భారీ ప్రేమకు, విజయానికి 100 శాతం అర్హుడివి. జూలై 10న నీకు సాలిడ్ సక్సెస్ వస్తుందని నేను ముందే చెప్పాను, అదే జరిగింది. అఖిల్.. నువ్వు స్ట్రాంగ్‌గా కంబ్యాక్ ఇచ్చేశావ్! నువ్వొక అద్భుతమైన నటుడివి, నీతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాను” అంటూ అఖిల్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
నా చివరి సినిమా కూడా ఇక్కడే చేస్తా!
తన వ్యక్తిగత సినీ ప్రయాణం గురించి చెప్తూ భాగ్యశ్రీ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. గత ఏడాదిన్నర కాలంగా నా కెరీర్ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. నేను మానసికంగా కిందపడిపోయిన ప్రతిసారీ, నా సోషల్ మీడియాలో అభిమానులు పంపిన మెసేజ్‌లు, ఎడిట్ చేసిన రీల్స్, వారు చూపిన నిరంతర ప్రేమే నన్ను మళ్లీ లేచి నిలబడేలా చేశాయి అంటూ ఏడ్చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆమె తేరుకుని.. నేను ఒకటే గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్ నా కర్మభూమి. నా సినీ కెరీర్‌లో చివరి సినిమా చేయాల్సి వస్తే అది కూడా ఇక్కడే, ఈ టాలీవుడ్‌లోనే చేయాలని బలంగా కోరుకుంటున్నాను” అంటూ తన స్పీచ్ ముగించారు.

