Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనాభా సంక్షోభంతో కోలుకోలేని చైనా

జనాభా సంక్షోభంతో కోలుకోలేని చైనా

వార్త 2 weeks ago

China's Population : ప్రస్తుతం చైనా జనాభా 1.413 బిలియన్లతో భారత్ (1.48 బిలియన్లు) తర్వాత 2వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలుస్తున్నది. నేటి జనాభా మార్పుల గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే రానున్న రోజుల్లో చైనా పతనం తథ్యం అనిపిస్తోంది.

ప్రస్తుతం చైనాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ, ఉత్పాదకతకు మూలా ధారమైన యువత సంఖ్య తగ్గడం వేగంగా జరుగుతోంది. దీనికి తోడుగా అత్యంత ప్రమాదకరమైన మరో జనాభాకు సంబంధించిన అంశం చైనాను నిద్ర పోనివ్వడంలేదు. నేటి డిజిటల్ ఏఐ యుగంలో చైనాలో మహిళల జనాభాతగ్గడం గమనిస్తున్నారు. మళ్లీ జనాభా కోలుకునే స్థాయికి రావడా నికి కావలసినంత మహిళల జనాభా కనిపించడం లేదు. ఐరోపా, జపాన్లో లో జనాభా ఒకేసారి కాకుండా క్రమంగా, నెమ్మదిగా తగ్గడం జరిగింది. మహిళల సంఖ్య తగ్గడంతో చైనాలో జనాభా ప్రతికూల మార్పులు వేగంగా జరుగుతు న్నాయి. రానున్న భవిష్యత్తులో చైనాలో జనాభా మళ్లీ పెరగడం అసాధ్యంగా తోస్తున్నది. ఈ ప్రతికూల జనాభా మార్పులతో చైనాలో వినియోగదారులు తగ్గడం, మార్కెట్ కుచించుకుపోవడంతో చైనా ప్రగతి కుంటుపడే ప్రమాదం ఏర్పడుతున్నది.

Read Also : Census : జనగణనలో కులాలను చేరుస్తున్నారా?


China’s Population

China’s Population : వృద్ధుల జనాభా వేగంగా పెరగడం

1980-2016 మధ్యకాలంలో చైనా నిర్బం ధంగా అమలు పరిచిన ఏక సంతాన విధానం (వన్ చైల్డ్ పాలసీ)” కారణంగా స్త్రీపురుష నిష్పత్తి భారీగా పడిపోయిం ది. ఒకే కొడుకులను మాత్రమే కనాలనే చైనా దంపతులు ఆడ బిడ్డల్ని కడుపులోనే అబార్షన్రూపంలో హత్య చేయ డం కొనసాగింది. 2016 తర్వాత చైనాలో ‘ద్వి సంతాన విధానం’ అమలులోకి వచ్చింది. 2021లో చైనా ‘ముగ్గురు పిల్లల విధానం’ ప్రవేశపెట్టబడింది. ఎక్కువ పని గంటలు, జీవనశైలి మార్పులు, పట్టణీకరణ ప్రభావం, అధిక జీవన వ్యయం, మారుతున్న సామాజిక నియమాలు, తక్కువ వేత నాలు ఉండడంతో చైనాలో దంపతులు పిల్లల్ని కనడానికి జంకుతున్నారు. 2022 నుంచి చైనా జనాభా క్షీణించడం మొదలైంది. నేటి చైనా జనాభా 141 కోట్ల నుంచి 2100 నాటికి 63 కోట్లకు పడిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. 1970లో మొత్తం సంతానోత్పత్తి రేటు 5.81 ఉండగా, 1979లో 2.75 వరకు పడిపోయింది. 2020 నాటికి ఇది 1.18, ప్రస్తుతం దాదాపు ఒకటి కన్న తక్కువగా నమోదు అవు తోంది. చైనా జనాభా సగటు వయస్సు 40.6 ఏండ్లు దాటింది. భారత జనాభా సగటు వయస్సు 29.2 ఏండ్లు గా నమోదు అవుతున్నది. 2040 నాటికి వృద్ధులు దాదాపు 28 మిలియన్లకు, 2050నాటికి జనాభాలో ౩౦ శాతానికి చేరవచ్చు. నేడు చైనాలో జననాల రేటు తగ్గడం, వృద్ధుల జనాభా వేగంగా పెరగడం, శ్రామికశక్తి కుచించుకుపోవడం వల్ల ఆ దేశ ఆర్థిక సామాజిక ప్రగతి ప్రమాదంలో పడుతు న్నది.

 China’s Population

ఆర్థిక అభివృద్ధి పతన అంచున

నేడు చైనాలో సంతానోత్పత్తి రేటు ప్రమాదకరమైన ఒకటికి పడిపోయింది. యువశక్తి తగ్గడం వల్ల శ్రామిక శక్తి పలుచబడుతోంది. వృద్ధుల జనాభా పెరగడంతో వారి పోషణ మహా భారమైపోతూ, వైద్య ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. చైనా జనాభా మార్పుల వివరణకు 421 నియమం” ప్రతిపాదించబడింది. ఒక బిడ్డకు అమ్మ నాన్న రూపంలో ఇద్దరు, నలుగురు పెద్దల (తాతలు అమ్మమ్మ|నాన్నమ్మ) రూపంలో నలుగురు ఒక కుటుంబంగా ఉంటు న్నారు. నేడు చైనాలో కేవలం 36 శాతం జనాభా మాత్రమే 20 నుంచి 59 ఏండ్ల వయస్సు లోపు ఉన్నారు. ఇదే జనాభా భారత్లో దాదాపు 60 శాతం వరకు ఉండడం విశేషం. ఈ జనాభా పడిపోవడంతో పారిశ్రామిక, తయారీ రంగ ప్రగతి రథం కదలడానికి మొరాయిస్తున్నది. సమీప భవిష్య త్తులో వినియోగదారులు తగ్గిపోయి ఆర్థికవృద్ధి మందగి స్తుందని హెచ్చరికలు వింటున్నాం. ఒకప్పుడు అత్యధిక ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తూ చైనా అగ్రభాగాన ఉండేది. నేడు జరుగుతున్న అవాంఛనీయ జనాభా మార్పులతో ఆర్థిక అభివృద్ధి ప్రమాదకరమైన పతన అంచున నిలబడిం ది. సంతానోత్పత్తి తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం, శ్రామిక శక్తి పలుచబడడం, మహిళల జనాభా కుచించుకు పోవడంతో చైనా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నది.

-డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి

Read hindi news :/hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టారా? అయితే మీకు జాక్‌పాట్ తగిలినట్లే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha