Dailyhunt
జనంలో వనజీవుల సమస్యకు పరిష్కారమేది?

జనంలో వనజీవుల సమస్యకు పరిష్కారమేది?

వార్త 3 weeks ago

Wildlife problem : తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా కోతుల బెడద కేవలం గ్రామీణ అసౌకర్యం స్థాయిని దాటి, ప్రాణాపాయం కలిగించే సామాజిక సంక్షోభంగా రూపాంతరం చెందు తోంది.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో 20కి పైగా కోతులు గుంపుగా దాడి చేసి 68ఏళ్ల వృద్ధు రాలిని బలితీసుకున్న ఘటన నాగరిక సమాజాన్ని కలవర పరచడమే కాదు, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందిం చాల్సిన అత్యవసర పరిస్థితిని గుర్తుచేసింది. అడవుల్లో ఉం డాల్సిన వన్యప్రాణులు గ్రామాల్లో, పట్టణాల్లో స్వైరవిహారం చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించడం పర్యావరణ సమతుల్యత ఎంతగా దెబ్బతిన్నదో తెలియజేస్తోంది. ఇప్పటికే అనేక గ్రామాల్లో కోతుల (Monkeys)దాడులు రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. పాదచారులపై వెంబడించడం, పిల్లలపై దాడి చేయడం, వృద్ధులను లక్ష్యంగా చేసుకోవడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి.చిన్నపిల్లలు స్కూల్కు వెళ్లడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. మహిళలు ఇంటి బయ టకు రావడానికి కూడా సంకోచిస్తున్నారు. గాయపడినవారు రాబిస్ వ్యాక్సిన్లు వేయించుకో వాల్సిన పరిస్థితి ఏర్పడుతోం ది. కొన్ని ప్రాంతాల్లో కోతులతో పాటు కుక్కల దాడులు కూడా పెరగడం గ్రామీణ భద్రతపై మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం అసౌకర్యం కాదు, ప్రజల ప్రాణ భద్రతను నేరుగా ప్రభావితం చేస్తున్న అత్యవసర ప్రజా సమస్యగా మారింది.

Read Also : Nepal Delegation Visit AP: వ్యవసాయ క్షేత్రాల పరిశీలనకు రానున్న నేపాల్ బృందం

 An urgent public issue that directly affects the safety of people’s lives

కోతుల బెడద

కోతుల బెడద వల్ల అత్యంత తీవ్రంగా నష్టపోతున్న వర్గం రైతాంగమే. కూరగాయలు, వేరుశెనగ, మొక్కజొన్న, పండ్ల తోటలు వంటి పంటలు భారీగా నాశ నం అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు వరి తప్ప ఇతర పంటలు వేయడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల పంటల వైవిధ్యం తగ్గిపోవడమే కాకుండా ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడుతోంది. వ్యవసాయం లాభ దాయకం కాకపోవడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిం టోంది. ఈ పరిస్థితి కొనసాగితే రైతుల జీవనోపాధి మాత్రమే కాదు, దేశ ఆహారభద్రతకూ దీర్ఘకాలిక ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్య తీవ్రత ఎంతగా పెరిగిందంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కోతుల(Monkeys) బెడద ప్రధాన అజెండాగా మారింది. కోతుల సమస్య ను పరిష్కరిస్తాం అనే హామీ ఇచ్చిన అభ్యర్థులను ప్రజలు గెలిపించడం పరిస్థితి ఎంత దారుణంగా-మారిందో తెలియ జేస్తోంది. ఒకప్పుడు రోడ్లు, నీరు, విద్యుత్ వంటి సమస్య ఎన్నికల చర్చల్లో ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు కోతుల బెడద వాటిని మించిపోయి ప్రజలు ఓటు నిర్ణయాన్ని ప్రభా వితం చేసే అంశంగా మారడం పరిస్థితి తీవ్రతకు నిదర్శ నం. కోతులు ఊళ్లపైకి రావడానికి ప్రధాన కారణం మనమే సృష్టించిన పర్యావరణ అసమతుల్యత. అడవుల విస్తీర్ణం తగ్గడం, పోడు వ్యవసాయం పేరుతో అటవీ నరికివేయడం, సహజ ఆహార వనరులు తగ్గిపోవడం వల్ల కోతులు జనావాసాల వైపు రావాల్సి వస్తోంది.


Declining forest cover and deforestation in the name of shifting cultivation

పునరావాసం కేంద్రాల ఏర్పాటు

అడవిలో ఆహారం కోసం గంటల తరబడి తిరగాల్సి వస్తే, గ్రామాల్లో మాత్రం తక్కువ సమయంలోనే ఆహారం లభించడం వాటిని ఇక్కడే స్థిరపడేలా చేస్తోంది. దీనికి తోడు సంప్రదాయ విశ్వాసాల కారణంగా కోతులను హాని చేయకపోవడం కూడా వాటి జనాభా పెరుగుదలకు దోహదపడుతోంది. ఇప్పటి వరకు కోతులను పట్టుకొని అడవుల్లో వదిలేయడం వంటి చర్యలు చేపట్టినా అవి శాశ్వత పరిష్కారం కాలేకపోయాయి. వదిలిన ప్రాంతాల నుంచి అవి మళ్లీ గ్రామాలకే తిరిగి వస్తున్నా యి. కొన్నిసార్లు సమస్యను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మాత్రమే మార్చినట్లవుతోంది. అందువల్ల శాస్త్రీ యంగా జనాభా నియంత్రణ చర్యలు చేపట్టడం అత్యవస రం. హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్న స్టెరిలైజేషన్ విధానాలు, పునరావాసం కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలను తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయా ల్సిన అవసరం ఉంది. అయితే సమస్య పరిష్కారంలో ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నది అధికార యంత్రాంగంలోని సమన్వయ లోపమే. కోతుల సమస్య ఎదురైనప్పుడు అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్ శాఖలు ఒకరిపై ఒకరు బాధ్యతలను నెట్టుకోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. కోతులు వన్యప్రాణుల జాబితాలో స్పష్టంగా నిర్వచించబడకపోవడం వల్ల వాటి నియంత్రణకు అవసరమైన నిధులు కేటాయించడంలో కూడా జాప్యం జరుగుతోంది. ప్రజాప్రతినిధులు పార్లమెంటులో గళమెత్తినా, క్షేత్రస్థాయిలో అమలు కావాల్సిన చర్యలు ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభావిత మండలాల్లో కోతుల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, పశు వైద్యుల పర్యవేక్షణలోభారీఎత్తున స్టెరిలైజేషన్ కార్యక్రమా లు చేపట్టడం, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి వ్యవసాయ, అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపొందించడం అత్యవసరం. కోతుల దాడిలో గాయపడిన వారికి, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడం కూడా ప్రభుత్వ బాధ్యతగా భావించాలి. గ్రామీణ సమాజం భయాందోళనల మధ్య జీవించాల్సిన పరిస్థితి ఏర్పడటం అభివృద్ధి చెందుతున్న సమాజానికి తగినది కాదు. కోతుల బెడదను తక్షణమే నియంత్రించకపోతే రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్ర మైన సామాజిక, ఆర్థిక సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. ప్రజల ప్రాణ భద్రత, రైతుల జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక స్థిరత్వం ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సమగ్ర, శాస్త్రీయ, దీర్ఘకాలిక కార్యాచరణతో ముందుకు రావాల్సిన అత్యవసర సమయం ఇదే.

-ఎల్లబోయిన వెంకటేశ్వర్లు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha