General coaches shortage:దసరా పండుగ వేళ ఊళ్లకు వెళ్లే సామాన్య ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. దక్షిణ మధ్య రైల్వే ఏసీ బోగీల సంఖ్యను పెంచడం వల్లరైళ్లలో జనరల్ కోచ్‌ల కొరత సమస్య తీవ్రంగా మారింది.
ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు భారీగా పెరగడంతో పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు రైలు ప్రయాణంపైన ఎక్కువ ఆధారపడుతున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి, చర్లపల్లి వంటి ప్రధాన స్టేషన్ల నుంచి నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ కోచ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సాధారణ ప్రయాణికుల అవసరాలను పక్కన పెట్టి ఏసీ రూట్లకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ప్రతిఒక్కరూ సొంత ఊరు చేరుకోవాలని ఆశపడుతున్న తరుణంలో ఈ పరిస్థితి ప్రయాణాన్ని నరకంగా మారుస్తోంది.
Read aso: Yasangi Subsidized Seeds: యాసంగి రైతులకు తెలంగాణ ప్రభుత్వం సాయం
general coaches shortage in trains
సామాన్యుడికి చోటేదీ?
గతంలో ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలులో స్లీపర్, జనరల్ బోగీలు ఎక్కువగా ఉండేవి. కాలక్రమేణా ఆ స్థానంలో ఏసీ బోగీలను విచ్చలవిడిగా ప్రవేశపెడుతుండటంతో సాధారణ సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఉదాహరణకు కాచిగూడ-విశాఖ రైలులో 10 ఏసీ, 6 స్లీపర్ కోచ్‌లు ఉండగా జనరల్ కేవలం 4 మాత్రమే ఉన్నాయి. అలాగే ఫలక్‌నుమా, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లలో 9 లేదా 10 ఏసీ, 6 స్లీపర్ బోగీలు ఉంటే జనరల్ 4 మాత్రమే కేటాయించారు. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో 8 ఏసీ, 12 స్లీపర్ బోగీలతో పాటు కేవలం 3 జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంచారు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో 6 ఏసీ, 10 స్లీపర్ బోగీలతో పాటు కేవలం 4 జనరల్ బోగీలు మాత్రమే ప్రయాణికులకు మిగిలాయి.
General coaches shortage:రైల్వే అధికారులు స్పందిస్తారా?
ప్రజాసంఘాల విమర్శలు, దేశవ్యాప్త నిరసనల నేపథ్యం చూస్తే రైల్వే బోర్డు ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలులో కనీసం 4 సాధారణ బోగీలు ఉండేలా నిబంధన తెచ్చింది. అత్యవసర నిబంధన ప్రకారం ప్రస్తుతం ప్రతి రైలులో పరిమితంగా 3 లేదా 4 జనరల్ కోచ్‌ల ఏర్పాటు చేస్తున్నారు. పండుగ రద్దీని తట్టుకోవడానికి ఈ తక్కువ సంఖ్య బోగీలు ఎంతమాత్రం సరిపోవడం లేదు. బోర్డింగ్ పాయింట్ మార్చుకునే నిబంధనలు ఉన్నప్పటికీ సామాన్యులకు అసలు సీట్లే లభించని పరిస్థితి ఉంది. తక్కువ ధరలకే ప్రయాణించే పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే సాధారణ కోచ్‌ల సంఖ్యను పెంచాలి.
Epaper: epaper.vaartha.com

