Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనసేన పార్టీలో చేరిన సింగర్ శ్రీలలిత భర్త సీతారామ్

జనసేన పార్టీలో చేరిన సింగర్ శ్రీలలిత భర్త సీతారామ్

వార్త 1 month ago

Gudipati Sitaram: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ జనసేనలోకి తాజాగా మరోసారి చేరికలు జరిగాయి. విజయవాడకు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ జనసేన పార్టీలో చేరారు.

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తాను జనసేనలో చేరతానని సీతారామ్ కోరగా, పవన్ కళ్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా గుడిపాటి సీతారామ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ‘నేషన్ ఫస్ట్’ అనే గొప్ప దృక్పథం కలిగిన నాయకుడని కొనియాడారు. దేశం, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా భావించే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అడుగులు వేయాలనే ఉద్దేశంతోనే తాను జనసేనలో చేరినట్లు స్పష్టం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేస్తానని సీతారామ్ తెలిపారు.

Read Also : Amaravati : నల్లమలలో అమరావతి ఆనవాళ్లు దొరికాయి - పవన్

 Sitaram, husband of singer Srilalitha, joins the Jana Sena Party.

Gudipati Sitaram: సామాజిక సేవా రంగంలో ‘గుడిపాటి ఫౌండేషన్’ ప్రస్థానం

గుడిపాటి సీతారామ్ కేవలం క్రీడాకారుడు, వ్యాపారవేత్త మాత్రమే కాకుండా మంచి సేవా హృదయం ఉన్న వ్యక్తి. యువతలో క్రీడలను ప్రోత్సహించడానికి ఆయన ‘గుడిపాటి ఫౌండేషన్’ను ప్రారంభించి, రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఫౌండేషన్ ద్వారా విజయవాడ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు, కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారు. దీంతో పాటు ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం, వారి విద్యా ఫీజులు చెల్లించడం, పుస్తకాల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, ఉచితంగా మందులను అందజేస్తూ సమాజంలో తనదైన ముద్ర వేశారు. గుడిపాటి సీతారామ్ సతీమణి యువ గాయని శ్రీలలిత కావడం విశేషం. ఎన్నో ప్రముఖ టీవీ షోలలో తన ప్రతిభను చాటుకుంది, సంగీత ప్రియులను అలరించింది. భార్యకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం, భర్త రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఈ దంపతులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.

ప్రకాశ్‌రాజ్‌ను బ్యాన్ చేయాలనుకున్నాం.. శివకృష్ణ షాకింగ్ కామెంట్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha