Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జంతర్ మంతర్ వద్ద చిగురించిన ప్రేమ.. పెళ్లి పీటలెక్కిన జంట!

జంతర్ మంతర్ వద్ద చిగురించిన ప్రేమ.. పెళ్లి పీటలెక్కిన జంట!

వార్త 1 week ago

‘NEET Paper Leak Protest:ప్రేమ ఎప్పుడూ, ఎక్కడైనా చిగురిస్తుంది’ అనే మాటను నిజం చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అపూర్వ ప్రణయ గాథ సుఖాంతమైంది.

నీట్ (NEET) పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద సాగిన ఉద్రేకపూరిత నిరసన ప్రదర్శన.. ఇద్దరు యువతీయువకుల జీవితాలను ఒక్కటి చేసింది. బాధితురాలిగా నిరసనలో పాల్గొన్న ఢిల్లీ యువతి, బీహార్‌కు చెందిన మోహన్ శ్రీవాస్తవ్ అనే యువకుడిని వివాహం చేసుకుంది.

Read Also:Anti Paper Leak Bill : పేపర్‌ లీక్‌లపై కఠిన చట్టం: పార్లమెంట్‌లో సవరణ బిల్లు-2026 ప్రవేశపెడుతున్న కేంద్రం

NEET Paper Leak Protest: లాఠీఛార్జ్‌లో గాయం.. ఆసుపత్రిలో పరిచయం

జంతర్ మంతర్ వద్ద నీట్ అక్రమాలపై విద్యార్థులు, బాధితులు నిర్వహించిన నిరసన సందర్భంగా జరిగిన తోపులాట లేదా లాఠీఛార్జ్‌లో బీహార్‌కు చెందిన మోహన్ శ్రీవాస్తవ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న ఢిల్లీకి చెందిన సదరు యువతి సమయస్ఫూర్తితో స్పందించి, మోహన్‌ను తక్షణమే ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా క్రమంగా ఇష్టంగా, ఆపై గాఢమైన ప్రేమగా మారింది. మోహన్ పూర్తిస్థాయిలో కోలుకున్న అనంతరం, ఇరువైపులా ఒకరినొకరు అర్థం చేసుకుని ఢిల్లీలోని ఒక ఆలయంలో వేదమంత్రాల సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం కొత్త దంపతులు మోహన్ స్వస్థలమైన బీహార్‌కు తిరుగుముఖం పట్టారు. నిరసన వేదికగా మొదలైన ఈ ప్రేమకథ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Epaper: epaper.vaartha.com

శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha