Japan Earthquake: జపాన్ దేశంలో మరోసారి భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. దేశ రాజధాని టోక్యోతో పాటు ఇబరాకి, చిబా, సైతమా తదితర ప్రధాన నగరాల్లో భూమి తీవ్రంగా కంపించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత
అధికారుల సమాచారం ప్రకారం, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. అకస్మాత్తుగా సంభవించిన ఈ ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప ఉద్ధృతి కారణంగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఐదుగురు వ్యక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

