Iran-America War : అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ దేశాల మధ్య గత ఆరు నెలలుగా కొనసాగుతున్న తీవ్ర సైనిక ఘర్షణలు, ఉద్రిక్తతలు అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
అంతర్జాతీయ చమురు, ఇంధన రవాణాకు అత్యంత వ్యూహాత్మక కేంద్రమైన హార్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దక్షిణాది కరోలినాలోని మిర్టిల్ బీచ్‌లో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడారు. హార్ముజ్ జలసంధిని ప్రస్తుతం ఒక అమెరికా భూభాగంగానే తాను చూస్తున్నానని.. ఆ కీలక జలమార్గంపై వాషింగ్టన్‌కు సంపూర్ణ నియంత్రణ ఉందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందడానికి అనుమతించేది లేదని ఆయన హెచ్చరించారు.
Iran-America War
Iran-America War : యుద్ధాన్ని విరమించడమే ఇరు దేశాలకు మరియు ప్రపంచానికి శ్రేయస్కరం
మరోవైపు ఆరు నెలలుగా సాగుతున్న ఈ తీవ్ర సైనిక పోరాటానికి వెంటనే ముగింపు పలకాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ బహిరంగంగా పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇరాన్ ఎంతో బలమైన, గౌరవప్రదమైన స్థితిలో ఉందని, ఈ సమయంలో యుద్ధాన్ని (War) విరమించడమే ఇరు దేశాలకు మరియు ప్రపంచానికి శ్రేయస్కరమని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి ఇరాన్‌లోని పాఠశాలలు, ఆసుపత్రులు మరియు మౌలిక సదుపాయాలపై విచక్షణారహితంగా దాడులకు తెగబడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ద్వేషాన్ని మూటగట్టుకుందని ఆరోపించారు. ఇరాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు ఇలా ఉండగా.. అక్కడి సైనిక బలగాలు మాత్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి.
ఇరాన్ మొండి వైఖరిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం .. కఠిన చర్యలకు సిద్ధం

