Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జపాన్‌లో భారీ భూకంపం

జపాన్‌లో భారీ భూకంపం

వార్త 2 months ago

Japan Earthquake: జపాన్ దేశాన్ని భారీ భూకంపం వణికించింది. సోమవారం (ఏప్రిల్ 20, 2026) స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:53 గంటలకు ఉత్తర జపాన్‌లోని శాన్‌రికు తీరంలో భారీ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 7.4గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెల్లడించింది. సముద్ర మట్టానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంప కేంద్రం ఉండటంతో తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు.

Read Also:Iran-America War: ఇరాన్ యుద్ధంతో ఆర్థిక మాంద్యం వైపు ప్రపంచం

 Japan’s Coast Trembles

మూడు మీటర్ల మేర ఎగిసిపడనున్న అలలు

భూకంపం సంభవించిన వెంటనే జపాన్ అధికారులు ఇవాటే, అయోమోరి మరియు హక్కైడో తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రపు అలలు సుమారు 3 మీటర్ల (10 అడుగులు) ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. “ఒక్కసారి అలలు రావడం మొదలైతే అవి పదే పదే వచ్చే అవకాశం ఉంది, హెచ్చరికలు తొలగించే వరకు ఎవరూ సురక్షిత ప్రాంతాలను విడిచి రావద్దు” అని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

నిలిచిపోయిన బుల్లెట్ రైళ్లు.. టోక్యో వరకు ప్రకంపనలు

భూకంప కేంద్రం ఉత్తర జపాన్‌లో ఉన్నప్పటికీ, దాని ప్రభావం వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని టోక్యో వరకు కనిపించింది. టోక్యోలోని ఎత్తైన భవనాలు కొద్దిసేపు ఊగిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా టోక్యో – అయోమోరి మధ్య నడిచే షింకన్సెన్ (బుల్లెట్ రైలు) సర్వీసులను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం రైల్వే లైన్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.

Japan Earthquake: ప్రభుత్వం అప్రమత్తం

ప్రధాని సనే తకైచి భూకంపంపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంతాల నుండి ప్రజలను తరలించడం (Evacuation) ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 2011 నాటి వినాశకర సునామీ జ్ఞాపకాలు మరోసారి గుర్తుకు రావడంతో జపాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎటువంటి భారీ ప్రాణ నష్టం జరగలేదని, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలుస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

లెబనాన్‌లో ఏసు విగ్రహాన్ని సైనికుడు కొడుతున్న చిత్రం నిజమైనదే: ఇజ్రాయెల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha