Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jayakrishna: 'శ్రీనివాస మంగాపురం' మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్

Jayakrishna: 'శ్రీనివాస మంగాపురం' మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్

వార్త 4 months ago

వాలంటైన్స్ డే సందర్భంగా తెలుగు సినీ ప్రియులకు ఓ క్రేజీ అప్‌డేట్ వెలువడింది.. టాలీవుడ్ చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయం అవుతున్నాడు.

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ (Jayakrishna) ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను చిత్ర బృందం వాలంటైన్స్ డే సందర్భంగా అధికారికంగా విడుదల చేసింది.

Dhanush Controversy: వివాదంలో నటుడు ధనుష్‌

అజయ్ భూపతి దర్శకత్వం

ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని (Rasha Thadani) ఈ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఇక ఈ సినిమాకు ఆర్ ఎక్స్ 100, మంగళవారం చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Kannada Film Industry: దర్శకుడు జో సైమన్ కన్నుమూత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha