కన్నడ చిత్ర ప్రముఖ దర్శకుడు, నటుడు జో సైమన్ (80) కన్నుమూశారు. నిన్న ఫిల్మ్ ఛాంబర్ సమావేశానికి వెళ్లిన ఆయన గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా..
చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. . సాహస సింహా, సింహా జోడి వంటి పాపులర్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. రవివర్మ, మణి, టైమ్ బాంబ్ తదితర సినిమాల్లో నటించారు. ఆయన మరణంపై కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ విచారం వ్యక్తం చేశారు.
Palash Muchhal: మహిళా క్రికెటర్ స్మృతి ఫ్రెండ్‌కు హైకోర్టు వార్నింగ్

ప్రముఖులు సంతాపం
1946లో మండ్యలో జన్మించిన జో సైమన్, 1967లో కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. నటుడిగా, దర్శకుడిగా, గీత రచయితగా 100కు పైగా చిత్రాల్లో పనిచేశారు. దివంగత లెజెండరీ నటులు విష్ణువర్ధన్ , అంబరీష్‌లతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. వారితో కలిసి పలు సూపర్ హిట్ చిత్రాలకు పనిచేశారు. రవి వర్మ, మణి, టైమ్ బాంబ్ వంటి సినిమాల్లో సైమన్ నటించారు. జో సైమన్ మృతి పట్ల కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక కన్నడ, సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడగి స్పందిస్తూ.. 'కన్నడ చిత్ర పరిశ్రమ ఒక డైనమిక్, సృజనాత్మక దర్శకుడిని కోల్పోయింది. ఆయన ఎంతోమంది కొత్త టాలెంట్‌ను పరిశ్రమకు పరిచయం చేశారు' అని కొనియాడారు.
Read hindi news: hindi.vaartha.com

