Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జేఈఈ మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల

జేఈఈ మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల

వార్త 2 weeks ago

JEE Main 2027 Schedule: దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Main) 2027 షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.

విద్యార్థుల సౌలభ్యం కోసం వచ్చే ఏడాది కూడా ఈ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది. మొదటి విడత పరీక్షలు 2027 జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో జరగనున్నాయి. ఏప్రిల్‌ నెలలో నిర్వహించే రెండో విడత పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా, ఈ పరీక్షలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 అక్టోబర్‌ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read Also : UPI Payments : రూ.2 వేలు దాటితే ఛార్జీలపై వ్యాపారులు, పెట్రోల్ బంక్ నిర్వాహకుల తీవ్ర ఆందోళన

 JEE Main 2027 schedule released

JEE Main 2027 Schedule: యూజీసీ నెట్, సియుఈటి పిజి పరీక్షల షెడ్యూల్ వెల్లడి

జేఈఈ మెయిన్‌తో పాటు మరికొన్ని కీలక జాతీయ స్థాయి పరీక్షల తేదీలను కూడా ఎన్‌టీఏ వెల్లడించింది. యూజీసీ నెట్ (UGC NET) పరీక్షను 2026 డిసెంబర్ 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-PG) – 2027 పరీక్షలను మార్చి 1 నుంచి 5, 8, 12 నుంచి 20, 24, 25 తేదీల్లో జరపనున్నట్లు తెలిపింది. ఈ విధంగా పరీక్షల తేదీలను ముందుగానే ప్రకటించడం ద్వారా విద్యార్థులు తమ సన్నద్ధతను మరింత ప్రణాళికాబద్ధంగా కొనసాగించేందుకు వీలవుతుంది.

యూపీఐ ఛార్జీలపై రాజకీయ సమరం: బీజేపీ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha