JEE Main 2026: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2026 సెషన్-2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. మరో రెండు రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఏప్రిల్ 2, 4 తేదీలలో పరీక్ష రాసే అభ్యర్థుల కోసం అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో వీటిని వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 2, 4, 5, 7, 8 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జరగనున్నాయి. భారతదేశంతో పాటు విదేశాల్లోని 15 ప్రధాన నగరాల్లో కూడా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 2, 4 తేదీల కార్డులు విడుదల కాగా, మిగిలిన తేదీల్లో (ఏప్రిల్ 5-8) పరీక్ష రాసే విద్యార్థుల అడ్మిట్ కార్డులను త్వరలోనే విడతల వారీగా విడుదల చేయనున్నట్లు ఎన్టీయే స్పష్టం చేసింది.
Read Also: Nitish Kumar Resignation: ఎమ్మెల్సీ పదవికి నీతీశ్ కుమార్ రాజీనామా!
How to download JEE Main hall ticket..
JEE Main 2026: పరీక్షా సమయాలు
పేపర్-1 (BE/BTech) పరీక్షలు ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో జరుగుతాయి:
- మొదటి షిఫ్ట్: ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.
- రెండవ షిఫ్ట్: మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 6:00 వరకు. ఏప్రిల్ 5 నుండి 8 వరకు జరిగే పరీక్షల్లో పేపర్-1తో పాటు పేపర్ 2A (BArch), పేపర్ 2B (B Planning) కూడా ఉంటాయి.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
అభ్యర్థులు కింది పద్ధతిలో తమ హాల్ టికెట్లను పొందవచ్చు:
- మొదట జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోమ్ పేజీలో కనిపించే JEE Main Session 2 Admit Card లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఓపెన్ అయిన లాగిన్ పేజీలో మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- వివరాలు సమర్పించిన తర్వాత అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
- దానిని పీడీఎఫ్ (PDF) రూపంలో డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

