Jharkhand Student Protest: ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), ఝార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC) నిర్వహించిన రిక్రూట్‌మెంట్ పరీక్షలలో భారీ అక్రమాలు, పేపర్ లీకేజీలు జరిగాయంటూ రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో విద్యార్థులు గత కొన్ని రోజులుగా చేపట్టిన నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
ఈ ఆందోళనకు బాలీవుడ్ ప్రముఖ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) తన మద్దతును ప్రకటించారు.
Read Also:MCC NEET UG 2026: ప్రారంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ!
సోనాక్షి సిన్హా ఇన్స్టాగ్రామ్ పోస్ట్

ప్రతిభావంతులైన విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్న వీడియోలను, 'ది లల్లన్‌టాప్' ఛానెల్ ఇంటర్వ్యూ క్లిప్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ సోనాక్షి స్పందించారు.
- "All eyes on Jharkhand Students" అని రాసుకొచ్చిన ఆమె, "మన దేశంలోని విద్యార్థులు ఇటువంటి పరిస్థితులను అనుభవించడం నిజంగా చాలా బాధాకరం.. అసలు ఇది ఎప్పుడు ఆగుతుంది?" అని ప్రశ్నించారు.
- ఖనిజ సంపద కలిగిన ఝార్ఖండ్ సమస్యలు జాతీయ స్థాయి మీడియా దృష్టికి రాకపోవడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసిన తీరును ఆమె హైలైట్ చేశారు.
Jharkhand Student Protest: విద్యార్థుల ఆరోపణలు & ప్రధాన డిమాండ్లు
- సీబీఐ (CBI), ఈడీ (ED) విచారణ: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన CID దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, కేంద్ర సంస్థలైన CBI, ED ద్వారా స్వతంత్ర విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
- పరీక్ష రద్దు: ఏప్రిల్ 19న జరిగిన 14వ JPSC ప్రిలిమినరీ పరీక్షను మరియు అక్రమాలు జరిగిన JSSC-CGL పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నారు.
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మౌనంపై విమర్శలు: దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై మాట్లాడే లోక్‌సభ ప్రతిపక్ష నేత (LoP) రాహుల్ గాంధీ ఝార్ఖండ్‌లో జరుగుతున్న ఈ అక్రమాలపై స్పందించకపోవడంపై విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికార జేఎంఎం (JMM) - కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం మధ్య ఉన్న రహస్య ఒప్పందాల (చీకటి ఒప్పందం) వల్లే కాంగ్రెస్ నాయకులు ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు.
ప్రస్తుతం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విచారణ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి.
Epaper: epaper.vaartha.com

