Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రారంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ!

ప్రారంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ!

వార్త 2 weeks ago

MCC NEET UG 2026: కమిటీ ఫర్ మెడికల్ కౌన్సెలింగ్ (MCC) నీట్ యూజీ (NEET UG) 2026 ఆల్ ఇండియా కోటా (15% AIQ), AIIMS, JIPMER, సెంట్రల్, డీమ్డ్ యూనివర్సిటీల్లో MBBS, BDS మరియు B.Sc నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

బుధవారం (ఆగస్టు 5) నుంచి అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది నుంచి విద్యార్థుల సౌకర్యార్థం భౌతికంగా కాలేజీకి వెళ్లే అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారానే డాక్యుమెంట్ వెరిఫికేషన్, Freeze, Float ఆప్షన్లను ఎంచుకునే సదుపాయాన్ని MCC కల్పించింది.

Read Also:SSC MTS Results 2026: ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ ఫలితాలు విడుదల..రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

NEET UG 2026 కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్

ఈసారి కౌన్సెలింగ్ ప్రక్రియను నాలుగు రౌండ్లలో (రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 మరియు ఆన్‌లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్) నిర్వహించనున్నారు.

రౌండ్ 1 షెడ్యూల్:

  • రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు: ఆగస్టు 5 నుంచి ఆగస్టు 12 (సాయంత్రం 3 గంటల వరకు, ఫీజు చెల్లింపు సాయంత్రం 6 వరకు)
  • వెబ్ ఆప్షన్ల ఎంపిక (Choice Filling): ఆగస్టు 6 నుంచి ఆగస్టు 13 వరకు
  • సీట్ల కేటాయింపు ప్రక్రియ: ఆగస్టు 13 నుంచి ఆగస్టు 16 వరకు
  • రౌండ్ 1 ఫలితాలు:ఆగస్టు 17
  • కాలేజీల్లో రిపోర్టింగ్: ఆగస్టు 18 నుంచి ఆగస్టు 22 వరకు

రౌండ్ 2, రౌండ్ 3 & స్ట్రే వేకెన్సీ షెడ్యూల్:

కౌన్సెలింగ్ రౌండ్రిజిస్ట్రేషన్ తేదీలుఫలితాల విడుదల తేదీకాలేజీల్లో రిపోర్టింగ్ తేదీలు
రౌండ్ 2 (Round 2)ఆగస్టు 25 - ఆగస్టు 29సెప్టెంబర్ 2సెప్టెంబర్ 3 - సెప్టెంబర్ 8
రౌండ్ 3 (Round 3)సెప్టెంబర్ 11 - సెప్టెంబర్ 15సెప్టెంబర్ 18సెప్టెంబర్ 19 - సెప్టెంబర్ 26
స్ట్రే వేకెన్సీ రౌండ్సెప్టెంబర్ 28 - సెప్టెంబర్ 30అక్టోబర్ 3అక్టోబర్ 4 - అక్టోబర్ 10

MCC NEET UG 2026: 85% స్టేట్ కోటా (State Quota) అడ్మిషన్లు

మిగిలిన 85 శాతం రాష్ట్ర కోటా సీట్ల కోసం ఆయా రాష్ట్రాల కౌన్సెలింగ్ అథారిటీలు వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.

  • స్టేట్ రౌండ్ 1: ఆగస్టు 13 నుంచి ఆగస్టు 22 వరకు
  • స్టేట్ రౌండ్ 2: ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు
  • స్టేట్ రౌండ్ 3: సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 26 వరకు
  • స్టేట్ స్ట్రే వేకెన్సీ రౌండ్: అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 5 వరకు

విద్యార్థులు నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు, డాక్యుమెంట్ అప్‌లోడ్ పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు MCC అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని సూచించారు.

Epaper: epaper.vaartha.com

నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha