Dailyhunt
జెట్లీ మూవీ రివ్యూ: సత్య కామెడీ మ్యాజిక్ రిపీట్ అయిందా?

జెట్లీ మూవీ రివ్యూ: సత్య కామెడీ మ్యాజిక్ రిపీట్ అయిందా?

వార్త 1 week ago

Jetlee Movie Review: కమెడియన్ సత్య, దర్శకుడు రితేష్ రానా కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. నేడు (మే 1) థియేటర్లలో విడుదలైన వీరి తాజా చిత్రం 'జెట్లీ' (Zetlee) ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

Read Also:Actress Reba Monica John: గుడ్ న్యూస్ చెప్పిన నటి రెబా మోనికా జాన్

Jetlee Movie Review: కథా సారాంశం

బ్యాంక్ స్కామ్ చేసి ఖాతాదారుల సొమ్ముతో పారిపోయిన ప్రజాపతి (అజయ్), ఆరు నెలల తర్వాత తిరిగి ఇండియాకు వస్తుంటాడు. ఏజెంట్ శివాని రాయి (రియా సింగ్) టీం అతన్ని తీసుకొస్తుండగా, అదే ఫ్లైట్‌లో అతన్ని చంపేందుకు కొందరు, కాపాడేందుకు మరికొందరు ఉంటారు. అదే ఫ్లైట్‌లో ఉన్న డాక్టర్ వేద వ్యాస్ (సత్య) తన గతాన్ని మర్చిపోయి ఉంటాడు. అసలు వేదవ్యాస్ ఎవరు? అతను ప్రజాపతిని చంపడానికి వచ్చాడా? ఈ స్కామ్‌లో అతని పాత్ర ఏంటి? అనేదే మిగిలిన కథ.

సినిమా విశ్లేషణ

తన మార్క్ కామెడీ టైమింగ్ మరియు మేనరిజమ్స్‌తో సత్య సినిమాను భుజాన వేసుకున్నాడు.సెకండ్ హాఫ్‌లో వెన్నెల కిషోర్ పాత్ర,సత్యతో అతని కాంబినేషన్ సీన్స్ నవ్వులు పూయిస్తాయి.మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వచ్చిన ఈ సినిమా టెక్నికల్‌గా బాగుంది.’మత్తు వదలరా’ స్థాయిలో కథలో పట్టు లేకపోవడం పెద్ద మైనస్.పాత్రల పరిచయం, ఫ్లైట్ సీక్వెన్స్‌లు చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తాయి.కొన్ని చోట్ల స్పూఫ్ సీన్స్ కథకు అడ్డుపడినట్లు అనిపిస్తుంది.

రితేష్ రానా మార్క్ కామెడీ,సత్య పెర్ఫార్మెన్స్ ఆశించి వెళ్లే వారికి ఈ సినిమా అక్కడక్కడ నవ్వులు పంచుతుంది. అయితే, బలమైన కథ ఆశించే వారికి మాత్రం ‘జెట్లీ’ అంతగా ఎక్కకపోవచ్చు. వీకెండ్‌లో కేవలం కామెడీ కోసం ఒకసారి చూడదగ్గ చిత్రం ఇది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నారా వారి ఇంటికి కొత్త అతిథి.. భార్యతో కలిసి నారా రోహిత్ క్యూట్ ఫోటో షూట్ వైరల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha