Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఝార్ఖండ్లో 18 వ రోజుకు చేరిన విద్యార్థుల ఆందోళన

ఝార్ఖండ్లో 18 వ రోజుకు చేరిన విద్యార్థుల ఆందోళన

వార్త 2 weeks ago

Student Protest Jharkhand : ఖార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల పరీక్షలు (JPSC, JSSC) మరియు ఫలితాల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు, ఉద్యోగార్థులు చేపట్టిన నిరసన ఆందోళనలు తీవ్రరూపం దాల్చి 18వ రోజుకు చేరుకున్నాయి.

“న్యాయం జరిగే వరకు పోరాటం నుంచి వెనక్కి తగ్గేదే లేదు” అని స్పష్టం చేసిన విద్యార్థి సంఘాలు, తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తోనే చర్చలు జరుపుతామని, మధ్యవర్తులతో మాట్లాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. పరీక్షల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని, కేవలం కొన్ని పరీక్షలను రద్దు చేసి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, దీనిపై సీబీఐ (CBI) విచారణ చేపట్టాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తోంది. కాగా, సమస్యను సున్నితంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమ్మెను వీడి నేరుగా చర్చల్లో పాల్గొనాలని సీఎం హేమంత్ సోరెన్ విజ్ఞప్తి చేశారు.

Read ALso : గుజరాత్‌లో దారుణం: ర్యాగింగ్ వేధింపులు తాళలేక జూనియర్ డాక్టర్ ఆత్మహత్య - నలుగురు సీనియర్లు సస్పెండ్

 Jharkhand Students Protest

పోలీసుల లాఠీఛార్జ్ – రాష్ట్ర బంద్‌కు బిజెపి పిలుపు

శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు మరియు లాఠీఛార్జ్ ప్రయోగించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులు గాయపడటంతో ఆందోళన మరింత హేయమైన రూపం దాల్చింది. విద్యార్థులపై జరిగిన ఈ దమనకాండకు నిరసనగా మరియు వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (BJP) ఇవాళ ‘ఝార్ఖండ్ రాష్ట్ర బంద్’కు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార సంస్థలు, రవాణా వ్యవస్థల స్తంభనతో పాటు పాఠశాలలు, కళాశాలలపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.

వారానికి నాలుగైదు రోజులు చెరువు నీళ్లలోనే గడుపుతున్న 16 ఏళ్ల బాలుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha