Boy living in Pond : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగా గ్రామానికి చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ అనే బాలుడి వింత పరిస్థితి స్థానికులను, వైద్యులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గత ఐదేళ్లుగా అతడు సాధారణ మనుషుల్లా భూమిపై కంటే చెరువు నీళ్లలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. వారంలో ఏకంగా 4 నుంచి 5 రోజులు, కొన్నిసార్లు వరుసగా 7 రోజుల పాటు రాత్రింబవళ్లు చెరువులోనే ఉండిపోతున్నాడు. నీటి నుంచి బయటకు రాగానే శరీరమంతా విపరీతమైన మంట, అసౌకర్యం కలుగుతోందని, చెరువు నీటిలోకి వెళ్లిన తర్వాతే ఉపశమనం లభిస్తుందని ఆ బాలుడు పేర్కొంటున్నాడు. అతడి ఈ వింత ప్రవర్తన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: CJP : మాకు 'PM కేర్స్' నుంచి ఫండింగ్ వస్తోంది - CJP సెటైర్
Boy living in Pond
Boy living in Pond : అనారోగ్య సమస్యలు - దారిద్య్రంలో కుటుంబం
అలా రోజుల తరబడి నీటిలోనే ఉండటం వల్ల అతడి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణిస్తోంది. గంటల తరబడి నీటిలో నానడం వల్ల తీవ్రమైన చర్మ వ్యాధులు (Skin Infections) ముసురుకుంటున్నాయి. తరచూ జలుబు, జ్వరం, దగ్గు మరియు నిరంతర ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు అతడిని వేధిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం పెద్ద ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లే ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో ఆ బాలుడికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు స్థానిక గ్రామస్థులు, దాతలు ముందుకు వస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగా గ్రామానికి చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ అనే బాలుడి వింత పరిస్థితి స్థానికులను, వైద్యులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత ఐదేళ్లుగా అతడు సాధారణ మనుషుల్లా భూమిపై కంటే చెరువు నీళ్లలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. వారంలో ఏకంగా 4 నుంచి 5 రోజులు, కొన్నిసార్లు వరుసగా 7 రోజుల పాటు రాత్రింబవళ్లు చెరువులోనే ఉండిపోతున్నాడు. నీటి నుంచి బయటకు రాగానే శరీరమంతా విపరీతమైన మంట, అసౌకర్యం కలుగుతోందని, చెరువు నీటిలోకి వెళ్లిన తర్వాతే ఉపశమనం లభిస్తుందని ఆ బాలుడు పేర్కొంటున్నాడు. అతడి ఈ వింత ప్రవర్తన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనారోగ్య సమస్యలు - దారిద్య్రంలో కుటుంబం
అలా రోజుల తరబడి నీటిలోనే ఉండటం వల్ల అతడి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణిస్తోంది. గంటల తరబడి నీటిలో నానడం వల్ల తీవ్రమైన చర్మ వ్యాధులు (Skin Infections) ముసురుకుంటున్నాయి. తరచూ జలుబు, జ్వరం, దగ్గు మరియు నిరంతర ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు అతడిని వేధిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం పెద్ద ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లే ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో ఆ బాలుడికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు స్థానిక గ్రామస్థులు, దాతలు ముందుకు వస్తున్నారు.

