Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జింబాబ్వే క్రికెట్‌లో విషాదం.. మాజీ ఫాస్ట్ బౌలర్‌ సారా దంబనేవానా ఇకలేరు

జింబాబ్వే క్రికెట్‌లో విషాదం.. మాజీ ఫాస్ట్ బౌలర్‌ సారా దంబనేవానా ఇకలేరు

వార్త 1 week ago

Sarah Dambanevana: జింబాబ్వే క్రికెట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్‌, అంతర్జాతీయ అంపైర్‌ సారా దంబనేవానా (36) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హరారేలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించినట్లు జింబాబ్వే క్రికెట్ ప్రకటించింది.

అయితే ఆమె మృతికి గల కారణాలను వెల్లడించలేదు.

ICC Reprimands Rovman Powell:వెస్టిండీస్‌కు ఐసీసీ షాక్.. రోవ్‌మన్ పావెల్, రూథర్‌ఫర్డ్‌పై చర్యలు!

2009 నుంచి 2014 వరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం

సారా దంబనేవానా 2009 నుంచి 2014 మధ్య జింబాబ్వే మహిళల జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఫాస్ట్ బౌలర్‌గా జట్టుకు సేవలందించిన ఆమె.. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అంపైరింగ్‌ రంగంలోకి అడుగుపెట్టారు.

Sarah Dambanevana: ప్రపంచకప్‌లలో అంపైర్‌గా సేవలు

2024 మహిళల టీ20 ప్రపంచకప్‌, 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లలో సారా అంపైర్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా, 2023 అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించిన తొలి జింబాబ్వే మహిళగా గుర్తింపు పొందారు. అటు ఆటగాళ్లా, ఇటు అంపైర్‌గా క్రికెట్‌కు సేవలందించిన సారా మరణంతో ఆ దేశ క్రికెట్‌ వర్గాల్లో విషాదం నెలకొంది.

Epaper: epaper.vaartha.com

విడిపోతున్నామన్న కొన్ని వారాలకే యూటర్న్.. పృథ్వీ షా జంట ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha