Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్

జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్

వార్త 4 days ago

IND vs ZIM 3rd T20: రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టు 92 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది.

Mitchell Starc: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్‌.. మెక్‌గ్రాత్ వరల్డ్ రికార్డ్ బ్రేక్‌

దంచికొట్టిన హర్మన్‌ప్రీత్, షఫాలి

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. కేవలం 41 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మరోవైపు ఓపెనర్‌ షఫాలి వర్మ కూడా వీరవిహారం చేసింది. 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు బాది జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించింది.

చేతులెత్తేసిన జింబాబ్వే బ్యాటర్లు

217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. ఓపెనర్‌ కెలిస్ న్‌ధ్లోవు ఖాతా తెరవకుండానే తొలి బంతికే పెవిలియన్‌ చేరింది. ఆ తర్వాత షార్నే మేయర్స్ (49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు), బెలవ్డ్ బిజా (44 పరుగులు) పోరాడినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

భారత బౌలర్లలో నందని శర్మ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అలాగే దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి తలాో వికెట్‌ దక్కించుకున్నారు. దీంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది.

కివీస్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా.. సిరీస్‌ గెలుపే లక్ష్యంగా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha