Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జీవో 252 సవరించాలని సిద్దిపేట కలెక్టర్‌కు వినతి!

జీవో 252 సవరించాలని సిద్దిపేట కలెక్టర్‌కు వినతి!

వార్త 2 weeks ago

GO 252 : జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయడం కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన G.O 252 ను సవరించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ హైమవతి కి వినతి పత్రం సమర్పించారు.

జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం సందర్బంగా ఈ మేరకు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు, TUWJ (IJU ) జిల్లా అధ్యక్షులు కె. రంగాచార్య, కమిటీ సభ్యుడు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిపల్లి అరుణ్ కుమార్, కమిటీ సభ్యుడు,యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూతురు రాజిరెడ్డి, కమిటీ సభ్యులు, సిద్దిపేట ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఐత శ్రీనివాస్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు, యూనియన్ ప్రతినిధులు ముంజ గిరి, సతీష్, వంశీధర్,కమిటీ సభ్యులు, మహిపాల్ రెడ్డి, పంగ రాజు లు కలిసి వినతి పత్రం అందజేశారు.

Read Also: Rice Purchases : మెదక్ కలెక్టర్ తీరుపై 'ప్రజా'గ్రహం

G.O 252 లో పొందపరిచిన కొన్ని నిబంధనల వల్ల కొన్ని పెద్ద పత్రికలు, మీడియం పత్రికల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలస్ట్ లకు చిన్నపత్రికల్లోని కొందరికి అక్రిడిటేషన్ కార్డులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. పెద్ద పట్టణాల్లో పనిచేస్తున్న వారికి ఒకే కార్డు వచ్చే పరిస్థితి ఉందని దానివల్ల సీనియర్ జర్నలిస్టులకు నష్టంకలుగుతున్నదని తెలిపారు.. అన్ని పత్రికలకు ప్రతి మండలానికి 150 కి పైగా సర్క్యూలేషన్ ఉండాలనే నిబంధన వల్ల మండలాల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు జారీ అయ్యే అవకాశం లేకుండా పోతున్నదని తెలిపారు.PRGI సర్టిఫికెట్ తో పాటు CA సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని సమాచార శాఖ అధికారులు అడుగుతున్నారని ఈ నిబంధన వల్ల పెద్ద పత్రికలకు కూడా అక్రిడీటేషన్ కార్డులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టులుగా అప్లై చేసుకున్నవారు తమ పేరుతో రాసిఉన్న 60 ఆర్టికల్స్ అందజేయాలని.. పత్రికాయాజమాన్యం నుండి తమ పత్రికకు ఆర్టికల్స్ రాస్తున్నట్టుగా లేఖ తీసుకురావాలని కూడా సమాచార శాఖ అధికారులు అడుగుతున్నారని దానివల్ల ఫ్రీలాన్స్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.. ఏ సంస్థ కూడా లేఖలు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. పత్రికలకు కొన్ని మండలాల్లో ఎక్కువ.. కొన్ని మండలాల్లో తక్కువ సరక్యులేషన్ ఉండే పరిస్థితి ఉంటుందని దానివల్ల మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు రాకుండా పోతుందని అన్నారు.

ఇలా కొన్ని నిబంధనల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అర్హులైన.. ఫీల్డ్ లో నిజంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు న్యాయం జరిగేవిధంగా G. O ను సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.. రాష్ట్ర సమాచార కమీషనర్, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి గారు చొరవ తీసుకొని GO ను కొంత సరళతరం చేసి జిల్లాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు న్యాయం జరిగేవిధంగా చూడాలని వినతిపత్రం లో పేర్కొన్నారు.. సిద్దిపేట జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల అభ్యర్థనను రాష్ట్ర సమాచార కమిషర్ దృష్టికి తీసుకు వెళ్తామని, ఈమేరకు రాష్ట్ర కమిషనర్ కు లేఖ రాయాలని DPRO రవికుమార్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు..

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కేటీఆర్ తీరుపై విరుచుకుపడ్డ యెన్నం శ్రీనివాస్ రెడ్డి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha