Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జియో IPO.. రికార్డులే రికార్డులు

జియో IPO.. రికార్డులే రికార్డులు

వార్త 10 hrs ago

JIO IPO : జియో ప్లాట్‌ఫామ్స్ రూ. 30,213 కోట్ల భారీ ఐపీఓ బిడ్డింగ్ ప్రారంభమైన కేవలం 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయి మదుపర్ల నమ్మకాన్ని చాటిచెప్పింది.

మొత్తం ఆఫర్ వ్యవధిలో ఊహించని రీతిలో 1.38 కోట్లకు పైగా దరఖాస్తులు రావడం ఒక అద్భుతం కాగా, ప్రపంచ మూలధన మార్కెట్ల చరిత్రలోనే కోటికి పైగా అప్లికేషన్లు సాధించిన తొలి ఐపీఓగా జియో సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశీయ రీటైల్ పెట్టుబడిదారులతో పాటు విదేశీ నిధుల వెల్లువతో జియో ఐపీఓ భారత మార్కెట్ స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరో ఎత్తుకు తీసుకెళ్లింది.

రూ. 7 లక్షల కోట్ల బిడ్లు - క్యూఐబీ (QIB) కోటా 70 రెట్ల ఓవర్ సబ్‌స్క్రిప్షన్

ఈ ఐపీఓకు మొత్తం మీద దాదాపు రూ. 7 లక్షల కోట్లకు పైగా విలువైన భారీ బిడ్లు రావడం మార్కెట్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. మొత్తం ఇష్యూ సైజు కంటే 22.2 రెట్ల అధిక సబ్‌స్క్రిప్షన్ నమోదు కాగా, ముఖ్యంగా అర్హత కలిగిన ప్రాతినిధ్య రంగానికి (QIB – Qualified Institutional Buyers) కేటాయించిన కోటా ఏకంగా 70 రెట్లకు పైగా ఓవర్ సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. జియో డిజిటల్, టెలికాం రంగ విస్తరణపై ఇన్వెస్టర్లు ఉన్నత స్థాయి విశ్వాసాన్ని కనబరిచారని, మార్కెట్ లిస్టింగ్ రోజున కూడా బంపర్ లాభాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పడిపోయిన వెండి ధర.. కొనుగోలుకు ఇది సరైన సమయమేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha