Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జొమాటో లేఆఫ్స్.. 250 మంది ఉద్యోగులపై వేటు

జొమాటో లేఆఫ్స్.. 250 మంది ఉద్యోగులపై వేటు

వార్త 2 weeks ago

Zomato Lay Off's: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో హైదరాబాద్‌లోని తన కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ ఆఫీసులో పనిచేస్తున్న దాదాపు 250 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

సంస్థలో ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ లేఆఫ్స్ చేపట్టినట్లు జొమాటో వెల్లడించింది. అయితే ఇన్-హౌస్ కస్టమర్ సపోర్ట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం లేదని సంస్థ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని కార్యకలాపాలను హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న జొమాటో ప్రధాన కార్యాలయానికి తరలించనున్నట్లు తెలిపింది. దీంతో కస్టమర్ సపోర్ట్ సేవలు కొనసాగుతాయని, కేవలం వాటి నిర్వహణ కేంద్రాన్ని హైదరాబాద్ నుంచి గురుగ్రామ్‌కు మార్చుతున్నట్లు కంపెనీ పేర్కొంది.

Read Also : LPG Gas Cylinder Prices: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. సామాన్యులపై మరోసారి భారం

 Zomato layoffs… 250 employees axed.

Zomato Lay Off’s: కీలక రంగాలు ఒక్కచోటికి

ప్రొడక్ట్, టెక్నాలజీ, అనలిటిక్స్ వంటి కీలక విభాగాలకు కస్టమర్ సపోర్ట్ టీమ్‌లను మరింత దగ్గరగా ఉంచాలనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జొమాటో వెల్లడించింది. కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలను ఒకే చోట కేంద్రీకరించడం ద్వారా అంతర్గత విభాగాల మధ్య సమన్వయం మరింత మెరుగుపడుతుందని సంస్థ భావిస్తోంది.

గత ఆరు నెలలుగా కస్టమర్ కేర్ సేవలను థర్డ్‌-పార్టీ సంస్థలకు అప్పగించే విధానం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పలు కంపెనీలు ఇన్‌-హౌస్ టీమ్‌లపై ఆధారపడటానికి బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్, అవుట్‌సోర్సింగ్ సేవలను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. దీంతో కస్టమర్ కేర్ విభాగాల్లో ఉద్యోగాలపై ప్రభావం పడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

బాధితులకు 4 నెలల సెవెరెన్స్ ప్యాకేజీ,హెల్త్ ఇన్సూరెన్స్

హైదరాబాద్ సెంటర్ మూసివేతతో ఉద్యోగం కోల్పోతున్న 250 మంది సిబ్బందికి జొమాటో తగిన ఆర్థిక భద్రతను కల్పిస్తోంది.

  • వేతన పరిహారం: ఆగస్టు నెల పూర్తి జీతంతో పాటు, కాంట్రాక్ట్ నోటీస్ పే, ఒకేసారి చెల్లించే ఎక్స్-గ్రేషియా కలిపి మొత్తంగా 4 నెలల వేతనాన్ని సెవెరెన్స్ ప్యాకేజీగా అందిస్తోంది.
  • వైద్య సదుపాయాలు: ఉద్యోగం నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా మార్చి 31, 2027 వరకు మెడికల్ ఇన్సూరెన్స్, మానసిక ఒత్తిడి తగ్గేందుకు కౌన్సెలింగ్ సపోర్ట్‌ను కొనసాగించే వెసులుబాటు కల్పించింది.

గత ఏడాది ఏప్రిల్ 2025లోనూ జొమాటో సుమారు 500 మంది జూనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించగా, ఇప్పుడు హైదరాబాద్ సెంటర్ మూసివేతతో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్ చోటుచేసుకోవడం గమనార్హం.

యాపిల్ సీఈఓగా జాన్ టెర్నస్ భాద్యతల స్వీకరణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha