Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యాపిల్ సీఈఓగా జాన్ టెర్నస్ భాద్యతల స్వీకరణ

యాపిల్ సీఈఓగా జాన్ టెర్నస్ భాద్యతల స్వీకరణ

వార్త 2 weeks ago

Apple CEO: టెక్ దిగ్గజం యాపిల్ (Apple) కంపెనీలో చారిత్రాత్మక నాయకత్వ మార్పు పూర్తయింది. గత 15 ఏళ్లుగా సంస్థను అగ్రపథాన నడిపించిన టిమ్ కుక్ (Tim Cook) సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోగా, కంపెనీ నూతన ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా (CEO) జాన్ టెర్నస్ (John Ternus) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

2011 ఆగస్టులో స్టీవ్ జాబ్స్ తర్వాత సీఈఓగా బాధ్యతలు చేపట్టిన టిమ్ కుక్, ఇకపై యాపిల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.

Read Also :Immigration Stamp: రేపటి నుంచి బోర్డింగ్ పాస్‌లపై ఇమ్మిగ్రేషన్ ముద్ర వేసే విధానానికి స్వస్తి

టిమ్ కుక్ విజయవంతమైన శకం & కొత్త సీఈఓ ముందున్న సవాళ్లు

ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలతో (Policy Makers) సంబంధాలపై కుక్ దృష్టి పెట్టనున్నారు. కంపెనీకి సంబంధించిన కీలక వ్యూహాత్మక వ్యవహారాల్లోనూ సహాయం అందిస్తారు. 2001లో ప్రొడక్ట్ డిజైన్ విభాగంలో చేరిన టెర్నస్, 2021 నాటికి హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు. ఐప్యాడ్, ఐఫోన్, మ్యాక్, ఎయిర్‌పాడ్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల వచ్చిన ఐఫోన్ ఎయిర్, మ్యాక్‌బుక్ నియో రూపకల్పన ఆయన బృందం ఆధ్వర్యంలోనే జరిగింది. టెర్నస్ ఇప్పుడు యాపిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలోనూ చేరారు.

Apple CEO: కుక్ హయాంలో అద్భుత వృద్ధి

2011లో 350 బిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపు 4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. వార్షిక ఆదాయం 108 బిలియన్ డాలర్ల నుంచి 400 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది.యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్, యాపిల్ పే వంటి సర్వీసెస్ వ్యాపారం ద్వారా ఏటా 100 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వస్తోంది. కొత్త సీఈఓ ముందున్న ఏఐ సవాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో రేసు వేగవంతమైన సమయంలో టెర్నస్ పగ్గాలు చేపట్టారు. యాపిల్ ఈకోసిస్టమ్‌ను కాపాడుకుంటూనే ఏఐ విభాగంలో పోటీని తట్టుకోవడం ఆయన ముందున్న ప్రధాన బాధ్యత.

వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha