Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జుబాలో విమానం కూలి 14 మంది దుర్మరణం?

జుబాలో విమానం కూలి 14 మంది దుర్మరణం?

వార్త 1 month ago

South Sudan Plane Crash: దక్షిణ సుడాన్ రాజధాని జుబా సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. సిటీలింక్ ఏవియేషన్ సంస్థకు చెందిన సెస్నా 208 కారవాన్ విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్‌తో సహా మొత్తం 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

జుబా నగరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Read Also:Robot Hugging Girl: అమ్మాయిని కౌగిలించుకున్న రోబో.. అసలేం జరిగిందంటే?

ప్రమాదం జరిగిన తీరు

ఈ విమానం యే (Yei) పట్టణం నుంచి జుబా అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఏప్రిల్ 27 ఉదయం 9:15 గంటలకు బయల్దేరిన విమానం, గమ్యస్థానానికి చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందు.. అంటే ఉదయం 9:43 గంటలకు రాడార్‌తో సంబంధాలను కోల్పోయింది. అనంతరం నిమిషాల వ్యవధిలోనే జుబా నగర శివారులో విమానం నేలకూలింది.

 South Sudan Plane Crash today

South Sudan Plane Crash: కారణం: ప్రతికూల వాతావరణం

ఈ ప్రమాదానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. విమానం ప్రయాణించే సమయంలో భారీ పొగమంచు కురవడం వల్ల విజిబిలిటీ (కనిపించే సామర్థ్యం) తగ్గిపోయిందని, దీనివల్ల విమానం నియంత్రణ కోల్పోయి కుప్పకూలిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. విమానం నేలకూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగి విమానం పూర్తిగా దగ్ధమైంది.

మృతుల వివరాలు

విమాన ప్రమాదంలో మరణించిన 14 మందిలో ఇద్దరు కెన్యా జాతీయులు కాగా, మిగిలిన 12 మంది దక్షిణ సుడాన్‌కు చెందినవారు. ఈ ఘటనపై దక్షిణ సుడాన్ పౌర విమానయాన సంస్థ పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఆ దేశంలో ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు తరచుగా సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

వామ్మో ..తోటి సైనికులను చంపి తింటున్న రష్యా సైనికులు !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha