Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూడాలకు 12 శాతం పెంచలేం - ఏపీ ప్రభుత్వం

జూడాలకు 12 శాతం పెంచలేం - ఏపీ ప్రభుత్వం

వార్త 3 weeks ago

Junior Doctors Protest : ఆంధ్రప్రదేశ్‌లో స్టైపెండ్ పెంపు డిమాండ్‌తో జూనియర్ డాక్టర్లు (జూడాలు) చేపట్టిన సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ఇంటర్న్‌లు, పిజి విద్యార్థులు మరియు సూపర్ స్పెషాలిటీ వైద్యులు తమ స్టైపెండ్‌ను కనీసం 12 శాతం చొప్పున పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

అయితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంటర్న్‌లకు 10 శాతం, స్పెషాలిటీ వైద్యులకు 3 శాతానికి మించి పెంచలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిమాండ్ల సాధనలో వ్యత్యాసాలు ఉండటంతో ఇరువర్గాల మధ్య ఉత్కంఠ నెలకొంది. ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ప్రభుత్వం, జూడా ప్రతినిధుల మధ్య మరో దఫా చర్చలు జరగనున్నాయి.

ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు – విధుల్లో ప్రైవేటు జూడాలు

జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పేషెంట్లకు వైద్య సేవలు కలగకుండా ఆరోగ్యశాఖ తగిన చర్యలు చేపట్టింది. సమ్మెకు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి జూనియర్ డాక్టర్లను డిప్యుటేషన్‌పై ప్రభుత్వ ఆస్పత్రులకు రప్పించి విధుల్లోకి తీసుకుంటోంది. అత్యవసర సేవలు, ఓపిడి విభాగాలు స్తంభించకుండా సీనియర్ వైద్యులకు తోడుగా ప్రైవేటు జూడాలను కేటాయించారు. ఇరుపక్షాల మధ్య జరగబోయే తదుపరి చర్చలలో సానుకూల నిర్ణయం వచ్చి సమ్మె విరమిస్తారేమోనని రోగులు, అధికారులు ఆశిస్తున్నారు.

సాధిక్ వల్లే నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ - SP బిందుమాధవ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha