Indias First Hydrogen Train: భారతదేశాన్ని నెట్ జీరో కార్బన్ ఉద్గారాల దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రోజన్ రైలు (Hydrogen Train) ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది.
పర్యావరణానికి ఎంతగానో మేలు చేసే ఈ అత్యాధునిక రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 17న హర్యానాలోని జీంద్ రైల్వే స్టేషన్ నుండి అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. భారతీయ రైల్వే తన ప్రతిష్టాత్మక పైలట్ ప్రాజెక్ట్ నిర్వహణ కోసం హర్యానా రాష్ట్రాన్ని వేదికగా ఎంచుకుంది.
India’s first hydrogen train set to launch on July 17.
Indias First Hydrogen Train: పర్యావరణ హితం.. పొగకు బదులు నీటి ఆవిరి!
ఈ అత్యాధునిక రైలు పూర్తిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ (Hydrogen Fuel Cell Technology) తో పనిచేస్తుంది. దీనివల్ల వాతావరణంలోకి ఎలాంటి హానికరమైన కార్బన్ లేదా రసాయన పొగలు విడుదల కావు. ఈ సాంకేతికత ద్వారా రైలు నడుస్తున్నప్పుడు కేవలం స్వచ్ఛమైన నీటి ఆవిరి (Water Vapor) మాత్రమే పర్యావరణంలోకి విడుదలవుతుంది. బొగ్గు, డీజిల్ రైళ్లతో పోలిస్తే ఇది వంద శాతం పర్యావరణ అనుకూలమైనది మరియు శబ్ద కాలుష్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
ఒకేసారి 2,600 మంది ప్రయాణించేలా డిజైన్
సాంకేతిక పరంగానే కాకుండా ప్రయాణికుల సామర్థ్యం విషయంలోనూ ఈ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. ఈ హైడ్రోజన్ రైలులో ఒకేసారి 682 మంది ప్రయాణికులు కూర్చుని ప్రయాణించేందుకు వీలుగా సీటింగ్ సదుపాయం కల్పించారు. మొత్తం మీద నిలబడే వారితో కలిపి దాదాపు 2,600 మంది ప్రయాణికులు ఈ రైలులో ఒకేసారి ప్రయాణించవచ్చు. భారతీయ రైల్వే చరిత్రలో ఇదొక సరికొత్త మైలురాయిగా నిలవనుంది.

