Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జులైలో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికలు!

జులైలో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికలు!

వార్త 2 months ago

TGSRTC Elections : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారవుతోంది.

ఈ మేరకు జూలై నెలలో ఎన్నికలు జరిపేందుకు యాజమాన్యం తుది కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (EU) ఎన్నికల నిర్వహణపై సంస్థకు అధికారికంగా లేఖ అందించింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల ప్రతినిధులతో యాజమాన్యం ఈ వారంలోనే కీలక భేటీ నిర్వహించనుంది. అయితే, ఎన్నికల బరిలో నిలవాలనుకునే ప్రతి కార్మిక సంఘం తప్పనిసరిగా తమ మునుపటి ఆర్థిక సంవత్సరాల ఆడిట్ నివేదికలను సమర్పించాలనే నిబంధనను అధికారులు విధించారు. ఈ నివేదికల పరిశీలన పూర్తయి, అన్ని లైన్ క్లియర్ అయిన తర్వాత జూలైలో పోలింగ్ నిర్వహించేందుకు కార్మిక శాఖ సమాయత్తమవుతోంది.

Read Also : గండిపేట భూమి కబ్జా కేసు..మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్

 TGSRTC

విలీన ప్రక్రియ ఆలస్యానికే ఎత్తుగడ? సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు!

ఈ ఎన్నికల ప్రక్రియపై ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీని పూర్తిస్థాయిలో విలీనం చేసే ప్రక్రియను మరింత ఆలస్యం చేయడానికే యాజమాన్యం ఈ ఎన్నికల ఎత్తుగడ వేసిందని ఆరోపిస్తూ ఒకటి, రెండు ప్రధాన సంఘాలు ఈ ఎన్నికలను బహిష్కరించాలని కార్మికులకు పిలుపునిస్తున్నాయి. విలీనం కాకుండా కాలయాపన చేయడానికే ప్రభుత్వం చూస్తోందని వారు విమర్శిస్తున్నారు. మరోవైపు, ఇతర కార్మిక సంఘాలు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలు జరిగి అధికారిక గుర్తింపు సంఘం ఏర్పడితేనే.. విలీనంతో పాటు కార్మికుల ఇతర సమస్యలపై ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచడానికి, చట్టబద్ధంగా పోరాడటానికి వీలవుతుందని సదరు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బెదిరింపులు.. జనసేన మద్దతుదారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha