Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్ 1 నుంచి తిరుపతికి సరికొత్త వీక్లీ రైలు!

జూన్ 1 నుంచి తిరుపతికి సరికొత్త వీక్లీ రైలు!

వార్త 3 months ago

Tirupati New Train: కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల రైల్వే ప్రయాణికులకు, తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ తీపి కబురు అందించింది.

ఈ జిల్లాల నుంచి నేరుగా తిరుపతికి వెళ్లేందుకు వీలుగా సరికొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. తిరుపతి – రక్సల్ – తిరుపతి (ట్రైన్ నంబర్లు 17433 / 17434) మధ్య నడవనున్న ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును జూన్ 1 నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also : Tirupati fire accident: తిరుపతిలో అగ్ని ప్రమాదం.. రూ. 5 లక్షల ఆస్తి నష్టం

 New weekly train to Tirupati from June 1st!

Tirupati New Train: రైలు నడిచే టైమ్ టేబుల్!

  • తిరుపతి – రక్సల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెం. 17433 ప్రతి సోమవారం ఉదయం 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. ఇది అదే రోజు అర్ధరాత్రి 12.25 గంటలకు పెద్దపల్లి జంక్షన్‌కు, రాత్రి 1.00 గంటకు మంచిర్యాలకు, తెల్లవారుజామున 1.54 గంటలకు కాగజ్‌నగర్‌కు చేరుకుంటుంది.
  • రక్సల్ – తిరుపతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెం. 17434. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి గురువారం ఉదయం 3.15 గంటలకు రక్సల్‌లో బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 1.44 గంటలకు కాగజ్‌నగర్, మధ్యాహ్నం 2.35 గంటలకు మంచిర్యాల, మధ్యాహ్నం 2.58 గంటలకు పెద్దపల్లి జంక్షన్‌కు చేరుకుంటుంది. అనంతరం శనివారం ఉదయం 9.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తెలంగాణలో ఈ రైలుకు వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, పెద్దపల్లి జంక్షన్లతో పాటు మంచిర్యాల, కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్లలో స్టాప్ సదుపాయం కల్పించారు.

ఈ కొత్త రైలు సర్వీసు కేవలం తిరుపతి భక్తులకే కాకుండా.. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే వారికి సైతం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ఈ రైలు ద్వారా జార్ఖండ్ రాజధాని రాంచీ, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌కూర్‌లతో పాటు ప్రముఖ నగరాలైన దుర్గ్, గోండియా, బిలాస్‌పూర్, బరౌని, దర్భంగా, సమస్తీపూర్‌లకు ప్రయాణం సుగమం కానుంది. ఈయా రాష్ట్రాల నుంచి జీవనోపాధి, ఉద్యోగాల నిమిత్తం వచ్చి కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో స్థిరపడిన వేలాది మంది వలస కార్మికులకు ఇది ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. వీటితో పాటు ఏపీలోని కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని పట్టణాలకు, కర్ణాటకలోని రాయ్‌చూర్‌కు వెళ్లే ప్రయాణికులకు కూడా ఈ రైలు ఎంతో ఉపయోగపడనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకం విధివిధానాలు ఖరారు !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha