Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్ 15 తర్వాత తేల్చుకుంటాం.. బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్

జూన్ 15 తర్వాత తేల్చుకుంటాం.. బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్

వార్త 1 week ago

Telangana Politics : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

తెలంగాణ రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని, దానిని కేంద్రం తప్పనిసరిగా సేకరించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

కిషన్ రెడ్డి చొరవ చూపాలన్న సీఎం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన బాధ్యతను నిర్వర్తించి రైతుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని సీఎం కోరారు. వడ్లతో పాటు జొన్నలు, మొక్కజొన్నలను కూడా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పంటకు సరైన మార్కెట్ కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. జూన్ 15లోపు కేంద్రం స్పందించకపోతే తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. అవసరమైతే రైతుల ధాన్యాన్ని తీసుకుని హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ముందు నిరసన తెలుపుతామని పేర్కొన్నారు.

Read also: Sathupalli Singareni : సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ప్రమాదం

 Telangana Politics

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై అసంతృప్తి

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూముల కేటాయింపుపై సహకరించడం లేదని విమర్శించారు. ఈ విషయంలో తాను పలుమార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని చెప్పారు. మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని రెండు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

రాయిలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha