Telangana Formation Day : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహించనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు, వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దీంతో కార్యక్రమం జరిగే ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ నెలకొనే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
కీలక మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు
బేగంపేట్ నుంచి సంగీత్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్, పాట్నీ, క్లాక్ టవర్ మార్గాల ద్వారా మళ్లించనున్నారు. తిరుమలగిరి వైపు వెళ్లే ప్రయాణికులు సెయింట్ జాన్స్ రోటరీ, షెనోయ్, ఏఓసీ, కేవీ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. అలాగే సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, ట్యాంక్‌బండ్, తిరుమలగిరి ప్రాంతాలను అనుసంధానించే పలు రహదారులపై కూడా ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ సిబ్బంది సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Read also: Sathupalli Singareni : సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ప్రమాదం
Telangana Formation Dayపార్కింగ్, బస్సులపై ప్రత్యేక నిబంధనలు
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రాకపోకలు తగ్గించాలని సూచించారు. కార్యక్రమ ప్రాంగణం సమీపంలో రోడ్డు పక్కన పార్కింగ్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
అనుమతి లేకుండా నిలిపిన వాహనాలను టోయింగ్ చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అత్యవసర సేవల వాహనాలకు మాత్రం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సందర్శకుల కోసం నాలుగు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయడంతో పాటు, క్యూ ఆర్ కోడ్ ఆధారిత నావిగేషన్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచారు. ట్రాఫిక్ పరిస్థితులను సీసీటీవీ కెమెరాలు, కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ సహాయం కోసం 8712662999 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

