Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్ 30వ తేదీ వరకూ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

జూన్ 30వ తేదీ వరకూ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

వార్త 1 week ago

Rain update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భారీ వర్షాలు పడతాయని చెప్పింది. జూన్ 30వ తేదీ వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.

భారీ వర్షాల కోసం రైతన్నలు ఎదురు చూపులు చూస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలోఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నాలుగు నెలలు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాడిపోయారు. త్వరగా వానలు పడాలని కోరుకున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించి పది రోజులు దాటుతున్నా సరైన వానలు పడకపోవడంతో తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈపరిస్థితుల్లో వాతావరణ శాఖ చెప్పిన తీపి కబురు ఊరట కలిగించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో పాటు మరికొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read Also: Andole Constituency: ఆందోల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మర్రి అరుణ కుమారి

 Rain update

Rain update: గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకూ ఈదురుగాలులు

గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకూ ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంకటే ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొంత వాతావరణం చల్లబడటంతో విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా తగ్గింది.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. వాతావరణ చల్లబడింది. అక్కడకక్కడా వానలు పడుతున్నాయి. అదే సమయంలో ఉక్కపోత కూడా కొంత మేరకు తగ్గింది. తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Read also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha