Yoga andhra 2026:అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను రాష్ట్రంలో 'యోగాంధ్ర-2026" పేరుతో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే విశిష్ట నినాదంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) వేడుకల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది (రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలు, గిరిజనులు, వివిధ సాంస్కృతిక కళాకారులు, యువజన సంఘాల సభ్యులు, ఆటో లారీ అసోసియేషన్ల సభ్యులు విద్యార్థిని విద్యార్థులు, స్వచ్చంద సేవా సంస్థల సభ్యులు) పౌరులను యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తామన్నారు.
Read also: Apspdcl Video Conference: పారిశ్రామిక విద్యుత్ సమస్యలపై రేపు వీడియో కాన్ఫరెన్స్
Yoga practice for health yogaandhra2026
Yoga andhra 2026:ఉచితంగా యోగా వీడియోలు పొందండి ఇలా
ఉచితంగా యోగాసనాలు వీడియోలు ఇంటింటికీ యోగాను చేరువ చేసే కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు 4కేటగిరిల్లో రూపొందించిన వీడియోలను ఉచితంగా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. వివిధ ఆసనాలపై 90, రోగ నివారణ ప్రత్యేక ఆసనాల వీడియోలు-21, రోజువారీ సాధన కోసం 7 (ఆసనాలు-ప్రాణాయామం సెట్), యోగాపై సందేహాలను (షార్ట్ వీడియోలు) 50ప్రశ్నల రూపంలో నివృత్తి చేసేలా వీడియోలను రూపొందించారు. వాట్సాప్ నెంబర్ 8142404888ద్వారా హాయ్ అని టైపు చేస్తే వెంటనే క్యూఆర్ కోడ్ వస్తుంది. దీన్ని స్కాన్ చేస్తే గూగుల్ డ్రైవ్ లింక్ వస్తుంది. దాని ద్వారా వీడియోలను ఎప్పుడైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చని డాక్టర్ మంతెన సత్యనారాయణ తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. సార్థక్ పీడీఎస్ పథకంతో కొత్త మార్పులు

