EPF Interest Credit: దేశంలోని కోట్లాది మంది ఈపీఎఫ్ (EPF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీ జమ ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఆలస్యమైన ఈ ప్రక్రియ, త్వరలోనే పట్టాలెక్కనుంది.
Read also: Gold price 14/04/26 : యుద్ధ అనిశ్చితి మధ్య బంగారం ధరలు తగ్గింపు
Interest credit from June.. ATM facility too!
జూన్ నుంచి ఖాతాల్లోకి వడ్డీ
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ఫలితాలు మే నెలలో వెలువడనున్నాయి. ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే, జూన్ నుండి ఆగస్టు మధ్య కాలంలో ఖాతాదారులందరి అకౌంట్లలో వడ్డీ నిధులు జమ కానున్నట్లు సమాచారం. ఈపీఎఫ్‌వో (EPFO) ఇప్పటికే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటును 8.25 శాతంగా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ పెంచిన వడ్డీ రేటు ఖాతాదారులకు ఆర్థికంగా అదనపు ప్రయోజనాన్ని చేకూర్చనుంది.
EPF Interest Credit: పీఎఫ్ విత్‌డ్రాలో విప్లవాత్మక మార్పులు
నగదు జమ చేయడమే కాకుండా, విత్‌డ్రా ప్రక్రియను కూడా ప్రభుత్వం మరింత సరళతరం చేయబోతోంది. పీఎఫ్ నిధులను అవసరమైనప్పుడు సులువుగా తీసుకునేందుకు యూపీఐ (UPI) మరియు ఏటీఎం (ATM) సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని ఈపీఎఫ్‌వో భావిస్తోంది. దీనివల్ల కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, ఎక్కడి నుండైనా అత్యవసరంగా నగదును పొందే వీలు కలుగుతుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

