Junior Doctors : ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. స్టైఫండ్ పెంపు డిమాండ్‌పై ప్రభుత్వం మరియు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని రెసిడెంట్ (Junior Doctors) డాక్టర్లు, ఇంటర్నెస్, పీజీ విద్యార్థులు ఈ సమ్మెలో భాగంగా అత్యవసర సేవలను సైతం బహిష్కరించారు
పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్ రివిజన్‌ను :
గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్ రివిజన్‌ను అమలు చేయాలని, 15 శాతం మేర స్టైఫండ్ పెంచాలని జూనియర్ డాక్టర్ల సంఘం (APJUDA) బలంగా డిమాండ్ చేస్తోంది. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారీ పెంపు సాధ్యం కాదని, ప్రభుత్వం తరఫున పరిమిత శాతంలో వార్షిక ఇంక్రిమెంట్లు లేదా తక్కువ పెంపును అమలు చేసేలా ప్రతిపాదనలు వచ్చాయి.

ఈ ప్రతిపాదనలను జూడాలు తిరస్కరించడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. చర్చలు సఫలం కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు, సీనియర్ డాక్టర్లు మరియు ప్రైవేట్ వైద్యుల సేవలను వినియోగించుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ సమస్యకు త్వరలోనే సానుకూల పరిష్కారం లభిస్తుందని విద్యార్థులు, రోగులు ఎదురుచూస్తున్నారు.

