Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూరాలకు 2 లక్షల క్యూసెక్కుల వరద.. 27 గేట్లు ఎత్తివేత

జూరాలకు 2 లక్షల క్యూసెక్కుల వరద.. 27 గేట్లు ఎత్తివేత

వార్త 3 days ago

Jurala Project Flood Water: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంతో కృష్ణమ్మ ఉప్పొంగి పరవళ్ళు తొక్కుతోంది. దీంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో జలాశయం నిండు కుండలా మారింది.

జూరాల ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమై నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వైపు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి సుమారు 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది.

జూరాల ఇన్ ఫ్లో – అవుట్ ఫ్లో వివరాలు

జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టం 8.184 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఏకంగా 1,92,000 క్యూసెక్కుల భారీ ఇన్ ఫ్లో (జలరాశి) వచ్చి చేరుతోంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు జూరాల ప్రాజెక్టుకు చెందిన 27 క్రస్ట్ గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా 1,85,004 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.దీనికి తోడు విద్యుత్ ఉత్పత్తి (పవర్ హౌస్) నిమిత్తం మరో 31,758 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి వదులుతున్నారు.

Jurala Project Flood Water: వివిధ కాలువలు, లిఫ్ట్‌లకు నీటి విడుదల

జూరాల ప్రాజెక్టు ఆధారిత ఆయకట్టు స్థిరీకరణ మరియు తాగునీటి అవసరాల కోసం వివిధ కాలువలు, ఎత్తిపోతల పథకాలకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు:

  • భీమా లిఫ్ట్ – 1: 1,300 క్యూసెక్కులు
  • భీమా లిఫ్ట్ – 2: 750 క్యూసెక్కులు
  • కోయిల్ సాగర్ లిఫ్ట్: 315 క్యూసెక్కులు
  • ఎడమ కాలువ: 870 క్యూసెక్కులు
  • కుడి కాలువ: 500 క్యూసెక్కులు
  • సమాంతర కాలువ: 600 క్యూసెక్కులు

మొత్తంగా జూరాల ప్రాజెక్టు నుంచి అన్ని మార్గాల ద్వారా కలిపి 2,21,765 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదు కాగా, ఈ నీరంతా వేగంగా నాగార్జునసాగర్ వైపు మార్గమధ్యంలో ఉన్న శ్రీశైలం జలాశయానికి పరుగులు తీస్తోంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను మరియు నది తీరంలో ఉండే మత్స్యకారులను అధికారులు ముందస్తుగా అప్రమత్తం చేశారు

ఒక్క ఎకరా ఎండిపోకుండా రైతాంగాన్ని ఆదుకుంటాం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha