CM Vijay- Ricky Radhan Pandit: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తక్కువ సమయంలోనే ఒక వివాదాస్పద నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు, ఆధ్యాత్మిక సలహాదారు అయిన రికీ రాధన్ పండిట్ వెట్రివెల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకమైన OSD (Officer on Special Duty - Political) గా నియమించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Read Also:CM Vijay: తమిళనాడులో 'విజయ్' కేక: షణ్ముగంతో కీలక భేటీ
CM Vijay- Ricky Radhan Pandit: ఎవరీ రికీ రాధన్ పండిట్?
రాధన్ కేవలం విజయ్ జ్యోతిష్యుడే కాదు, ఆయనకు రాజకీయ ప్రముఖులతో దశాబ్దాల అనుబంధం ఉంది.దివంగత సీఎం జయలలితకు కూడా ఈయన జ్యోతిష్యుడిగా పనిచేశారు. అలాగే బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీకి సైతం ఇష్టమైన జ్యోతిష్యుడిగా ఆయన తనను తాను అభివర్ణించుకున్నారు.విజయ్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని ఏడాది క్రితమే రాధన్ జోస్యం చెప్పారు. విజయ్ రాజకీయ అరంగేట్రం నుండి కీలక కార్యక్రమాల్లో ఆయన వెంటే ఉంటూ ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్నారు.
అయితే, విజయ్ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ ఎక్స్ (ట్విట్టర్)లో ''నాకు అర్థం కావడం లేదు. ఒక జ్యోతిష్యుడికి ఓఎస్డీ పదవి ఎందుకు అవసరం?? ఎవరైనా వివరించగలరా?' అని ఆయన ప్రశ్నించారు. జ్యోతిష్యులకు, రాజకీయ నాయకులకు ముఖ్యంగా దక్షిణాదిలో సన్నిహిత సంబంధం ఉంటుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
అసోం రాజకీయాల్లో 'మామ' మేజిక్: హిమంత బిశ్వ శర్మ హ్యాట్రిక్ విజయం

