Swiss Air Emergency Landing: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి జ్యూరిచ్ (స్విట్జర్లాండ్) వెళ్లాల్సిన స్విస్ ఎయిర్‌లైన్స్ (LX147) విమానంలో టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది.
అప్రమత్తమైన పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.
Read Also:Quick Commerce Sales: ఎండల దెబ్బ.. స్విగ్గీ, జెప్టోలో పెరిగిన కూలింగ్ ప్రొడక్ట్స్ డిమాండ్
Swiss Air Emergency Landing; ఏం జరిగింది?
ఆదివారం తెల్లవారుజామున 1:08 గంటల సమయంలో విమానం రన్‌వేపై టేకాఫ్ కోసం వేగంగా దూసుకెళ్తోంది. సరిగ్గా అదే సమయంలో విమానం ఇంజిన్‌లో తీవ్రమైన సాంకేతిక సమస్య ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు.పైలట్లు అత్యవసర బ్రేకులు వేసి టేకాఫ్‌ను నిలిపివేశారు.భద్రతా కారణాల దృష్ట్యా విమానంలోని ప్రయాణికులను వెంటనే ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించారు.ఆ సమయంలో విమానంలో 232 మంది ప్రయాణికులు, నలుగురు చిన్నారులు మరియు సిబ్బంది ఉన్నారు.
Delhi Airport Emergency Landing
ప్రయాణికులను ఎమర్జెన్సీ స్లైడ్ల ద్వారా కిందకు దించారు.ఈ తరలింపు ప్రక్రియలో ఆరుగురు ప్రయాణికులు గాయపడగా, వారిని చికిత్స కోసం మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్విస్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఘటనకు గల కారణాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. విమానాన్ని పరిశీలించేందుకు ఢిల్లీకి తమ సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపుతున్నామని ఎయిర్‌లైన్ పేర్కొంది. ప్రయాణికులందరికీ ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు, హోటల్ వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

