Karimnagar Jewellery Robbery: కరీంనగర్ నగరంలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో జనసంచారం మొదలవుతున్న తరుణంలో ఓ ఘటన చోటుచేసుకుంది. సిబ్బంది జ్యువెలరీ షాపును తెరిచి, లాకర్‌లోని బంగారు ఆభరణాలను కౌంటర్లలో డిస్‌ప్లే పెడుతుండగా, రెండు బైకులపై వచ్చిన ఐదుగురు ముసుగు ధరించిన దుండగులు లోపలికి ప్రవేశించారు.
Read Also:Visakhapatnam Crime: ఆరోగ్యం పేరుతో అసభ్యం.. స్పాల్లో వ్యభిచార ముఠాలు గుట్టు రట్టు
Karimnagar Jewellery Robbery: 30 రౌండ్ల కాల్పులు – ఒకరి మృతి
లోపలికి రాగానే దుండగులు భయాందోళన సృష్టించేందుకు గాలిలోకి మరియు సిబ్బందిపై విచక్షణారహితంగా సుమారు 30 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో షాపులో పనిచేస్తున్న ఒక సిబ్బంది బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
కామారెడ్డి పాత బస్టాండ్ వద్ద భారీ అగ్నిప్రమాదం..12 షాపులు దగ్ధం

