Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాబోయే భర్తను చంపేసి.. ఇన్‌స్టాలో కన్నీళ్ల నాటకం

కాబోయే భర్తను చంపేసి.. ఇన్‌స్టాలో కన్నీళ్ల నాటకం

వార్త 1 week ago

Ketan Agarwal Pune Murder Case: ఈ ఏడాది రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌ వేదికగా నవంబర్‌లో రాయల్ వెడ్డింగ్‌ చేసుకోవాల్సిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మహారాష్ట్రలోని ఒక చారిత్రక కోటపై నుంచి లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

తొలుత ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించినప్పటికీ, పోలీసుల లోతైన విచారణలో కాబోయే భార్యే మహానటిలా నటించి, ప్రియుడితో కలిసి అతడిని హత్య చేసినట్లు తేలింది.

పూణే జిల్లా గహుంజే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్, తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. జూన్ 18వ తేదీన కాబోయే భార్య సియా గోయల్ పుట్టిన రోజు ఉండటంతో ఆమెకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. ఆమె కోరిక మేరకు యునెస్కో వారసత్వ కట్టడమైన ప్రసిద్ధ లోహ్‌గఢ్ కోటకు వెళ్లారు. అక్కడ కేతన్ తన కాబోయే భార్యను ఫొటోలు తీస్తున్న సమయంలో.. సియా తన ప్రియుడు చేతన్ బాబులాల్ చౌదరి (22)తో కలిసి కేతన్‌ను వెనుక నుంచి దాదాపు 400 అడుగుల లోతైన లోయలోకి తోసేసింది. ఆ తర్వాత లోనావాలా రూరల్ పోలీసులకు ఫోన్ చేసి, బలమైన గాలుల వల్ల కేతన్ అదుపుతప్పి లోయలో పడిపోయాడంటూ నమ్మించి యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేయించింది.

Read Also : CI Nagaraju SIT Investigation: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజును 6 గంటల పాటు ప్రశ్నించిన సిట్

Ketan Agarwal Pune Murder Case: చంపేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో కపట ప్రేమ నాటకం!

కేతన్ మరణవార్త బయటకు రాగానే తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సియా గోయల్ సోషల్ మీడియాలో పెద్ద డ్రామానే మొదలుపెట్టింది. కేతన్‌తో కలిసి కార్లో ప్రయాణించిన వీడియోలు, ఇద్దరూ డ్యాన్స్ చేసిన రొమాంటిక్ క్లిప్పింగులను జత చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ స్టోరీని పోస్ట్ చేసింది. “సరిగ్గా నా పుట్టినరోజు నాడే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయావా? మన పెళ్లికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉన్నప్పుడు ఎందుకు ఇలా చేశావు? నిన్ను ఎంతో ప్రేమించిన నన్ను ఎందుకు వదిలేశావో ఇప్పటికీ అర్ధం కావడం లేదు. నా గుండెకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని.. ప్లీజ్ తిరిగి వచ్చేయ్” అంటూ కన్నీరు కారుస్తూ కపట ప్రేమ నాటకమాడింది.

తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి అసలు నిజం

కేతన్ మరణంపై తండ్రి విశాల్ అగర్వాల్‌కు తీవ్ర అనుమానం రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ పర్యవేక్షణలో లోకల్ క్రైమ్ బ్రాంచ్ సియా, చేతన్‌లను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు గుట్టు రట్టయింది. పోలీసుల కథనం ప్రకారం.. సియా గోయల్‌కు పూణే కొంధ్వా ప్రాంతానికి చెందిన చేతన్ చౌదరితో చాన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రియుడంటే విపరీతమైన ఇష్టం ఉన్న సియాకు కేతన్‌తో పెళ్లి కావడం అస్సలు ఇష్టం లేదు. కానీ తల్లిదండ్రులకు ఆ విషయం తెలియకుండా ఉండేందుకు కేతన్ అంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు నటించింది. కేతన్ బతికుంటే తాము కలుసుకోలేమని భావించిన ఈ ఇద్దరు ప్రేమికులు.. పక్కా ప్లాన్ ప్రకారమే కోటపైకి రప్పించి అంతమొందించారు. నిందితుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరిలపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద హత్య, నేరపూరిత కుట్ర కేసులు నమోదు చేసి మంగళవారం ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

ప్రియుడి మోజులో కన్నపిల్లలను వేడి నూనెతో కాల్చిన కసాయి తల్లి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha