Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు!

కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు!

వార్త 3 weeks ago

RBI: భారతదేశంలో కరెన్సీ నోట్లు త్వరలో మారనున్నాయా..? కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు రానున్నాయా..? ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోందా..?

అంటే అవుననే సమాధానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్ల తయారీకి ఖర్చు ఎక్కువవుతుంది. దీంతో వ్యయాన్ని తగ్గించుకునేందుకు పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టే ఆలోచన ఆర్బీఐ చేస్తోందని, దీనిపై చర్చలు కూడా జరుపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. భారత కరెన్సీ నోట్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పాలిమర్ నోట్లను తీసుకురావడంపై ఆర్బీఐ సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

Read Also: RBI: సంక్షేమ పథకాల్లో డిజిటల్ కరెన్సీ..ఆర్బీఐ కీలక యోచన

 RBI

RBI: ఖర్చు చాలా తక్కువ

పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్ల తయారీకి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఎక్కువకాలం చినగకుండా ఉంటాయి. అంతేకాకుండా వీటి వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ కారణంతో ఆర్బీఐ పాలిమర్ నోట్లను తీసుకురావడంపై చర్చలు ప్రారంభించిందని, తొలుత ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని సమాలోచనలు చేస్తోంది. రానున్న రోజుల్లో ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. పాట్నా, ముంబైలలో జరిగిన ఆర్‌బిఐ గత రెండు బోర్డు సమావేశాల్లో పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టడంపై చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. ఇక ఈ నోట్లను ఏటీఎంల ద్వారా కూడా సులువుగా తీసుకోవచ్చు. ఇందుకు కావాల్సిన వనరులు కూడా ప్రస్తుతం సిద్దంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏటీఎంల ద్వారా జారీ చేసే విధానంలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు.

 RBI

అప్పట్లో గ్రీన్ సిగ్నల్

అయితే 2012లో యూపీఏ ప్రభుత్వం ఐదు నగరాల్లో ఒక బిలియన్ రూ.10 పాలిమర్ నోట్లతో కూడిన ఫీల్డ్ ట్రయల్‌కు అప్పట్లో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. కానీ టెక్నికల్ సమస్యల వల్ల ఈ ప్రాజెక్ట్‌పై వెనకడుగు వేసింది. నకిలీలను అరికట్టడం కంటే నోట్ల మన్నికను, నిల్వ కాలాన్ని మెరుగుపరచడమే ప్రాథమిక లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. అప్పట్లో ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్లగా.. ఇప్పుడు మరోసారి వాటిని తీసుకురావడంపై చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో త్వరలోనే ఆర్బీఐ ముందడుగు వేయవచ్చని చెబతున్నారు. కాగా గత ఆర్ధిక సంవత్సరంలో కాగితపు కరెన్సీ నోట్ల ముద్రణకు రూ. 6,372.8 కోట్ల ఖర్చు అయింది. ఇక గత ఆర్ధిక సంవత్సరంలో సుమారు 23.8 బిలియన్ల పాడైపోయిన నోట్లను ఉపసంహరించుకున్నారు. ఇవి కూడా పెద్ద సవాల్‌గా మారాయి. పారవేసి నోట్లలో ఎక్కువగా రూ.500 నోట్ల ఉన్నాయి. ఆ తర్వాత రూ.100 నోట్లు ఉన్నాయి. డిజిటల్ చెల్లింపులలో నిరంతర వృద్ధి ఉన్నప్పటికీ.. నగదు డిమాండ్ నిలకడగా ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రాష్ట్ర అభివృద్ధికి రూ. లక్ష కోట్ల బడ్జెటేతర రుణాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha