Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు భవానీ భక్తులు మృతి

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు భవానీ భక్తులు మృతి

వార్త 2 days ago

Tragic accident in Kakinada : ఏపీలోని కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న భవానీ భక్తుల ప్రాణాలు రోడ్డు ప్రమాదం రూపంలో గాలిలో కలిసిపోయాయి.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జయనగరం జిల్లా డెంకాడ నుంచి విజయవాడకు వస్తున్న ప్రైవేట్ బస్సులో భవానీ భక్తులు ప్రయాణిస్తున్నారు. అయితే బస్సులో తలెత్తిన మరమత్తుల కారణంగా కత్తిపూడి వద్ద రోడ్డు పక్కన ఆపారు. ఈ క్రమంలో బస్సులో ఉన్న కొందరు భక్తులు టీ తాగేందుకు రోడ్డు దాటుతుండగా, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి విజయవాడకు కారులో వస్తున్న మరో బృందం వారిని ఢీకొట్టింది.

Chennai: చెన్నైలో యువ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అనుమానాస్పద మృతి

 Tragic accident in Kakinada

Tragic accident in Kakinada : మృతి చెందిన భక్తులు

ఈ ఘోర ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని క్రింది విధంగా గుర్తించారు. అలాగే, కారులో ప్రయాణిస్తున్న మరో ఏడుగురు భవానీ భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద స్థలాన్ని కాకినాడ డీఎస్పీ తిలక్ మరియు స్థానిక పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు వంగలపూడి అనిత, నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు మృతుల కుటుంబాలకు ప్రగాష్ట సంతాపం తెలిపారు. అమ్మవారి దర్శనానికి వస్తుండగా ఈ ప్రమాదం జరగడం అత్యంత బాధాకరమని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Epaper: epaper.vaartha.com

టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో కీలక మలుపు.. మరో నలుగురు అరెస్ట్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha