Kaleshwaram Barrages Restoration: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కీలక బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు భారీ కసరత్తును ప్రారంభించింది.
ఇందులో భాగంగా పనుల సమన్వయం, పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటిని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల, టన్నెలింగ్ నిపుణుడు, రిటైర్డ్ ఆర్మి అధికారి కల్నల్ పరిక్షి త్ మెహ్రా కన్వీనర్గా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను సమన్వయం చేయడం, నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకురావడం ఈ కమిటీ పని. వారానికి రెండుసార్లు సమావేశమై పురోగతిని ఈ కమిటీ సమీక్షించనుంది. ప్రతీరోజూ జరిగే పనులపై రోజువారీ పురోగతి నివేదికలను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Read Also:Extramarital affair : వివాహేతర సంబంధాలు… తెలంగాణలో రెండు దారుణాలు
Kaleshwaram Barrages Restoration: Government speed on Kaleshwaram restoration
వర్షాకాలం ప్రారంభం కాకముందే కీలకమైన పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. బ్యారేజీల పునాదుల పటిష్టతను తెలుసుకోవడానికి మే 30వ లోపు జియోటెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు. సెంట్రల్ వాటర్ కమిషన్(సిడబ్ల్యుఎస్), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఎ) సూచనలు, అనుమతుల మేరకు మాత్రమే ఈ మరమ్మతు పనులు సాగనున్నాయి. ముందుగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి మేడిగడ్డను పాక్షి కంగానైనా వినియోగంలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష ్యంగా కనిపిస్తోంది.
కాళేశ్వరం బ్యారెజిలకు వీలైనంత తొందరగా మరమ్మతు పనులను పూర్తి చేసి నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిన విధంగా బ్యారేజేల ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి అవసరమైన పరీక్షలు నిర్వహించి పునరుద్ధరించడం ప్రధాన లక్ష ్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలను తొందరగా పూర్తి చేస్తే దానికి అనుగుణంగా మరమ్మతు పనులు ప్రారంభం కానున్నాయి. బ్యారేజీలను పునరుద్ధరించేందుకు ఇంజినీర్లు, అధికారులతోపాటు ఆయా రంగాల్లో నిపుణులను కూడా కోఆర్డినేషన్ కమిటీలో సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :
గ్లోబల్ హబ్‌గా మార్చడమే లక్ష్యం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!

