Vijayawada news: విజయవాడ నగరం అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అయోధ్యనగర్ బసవతారక నగర్‌లో శుక్రవారం తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
కొత్త బంధంతో సరికొత్త జీవితాన్ని ప్రారంభించిన ఓ నవవధువు, పెళ్లైన కేవలం నాలుగు నెలలకే ప్రాణాలు తీసుకుంది. కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Newlywed commits suicide before the paarani (traditional red dye) on her feet could even dry… What exactly happened?
Vijayawada news: ఫ్యాన్‌కు ఉరివేసుకొని నవవధువు బలవన్మరణం
అయోధ్యనగర్ బసవతారక నగర్‌కు చెందిన గోనోల్ల దేవేంద్రకు, అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన మారాని చంద్రకళ (24)తో ఈ ఏడాది ఏప్రిల్ 23న పెద్దల సమక్షంలో వివాహమైంది. ఎంబీఏ పూర్తి చేసిన చంద్రకళ ఇంట్లోనే ఉంటోంది. దేవేంద్ర హనుమాన్‌పేటలోని ఒక ప్రైవేటు ట్రావెల్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం భర్త దేవేంద్ర విధుల నిమిత్తం బయటకు వెళ్లగా, చంద్రకళ ఒక్కతే ఇంట్లో ఉంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దేవేంద్ర భోజనానికి ఇంటికి బయలుదేరుతుండగా, చంద్రకళ స్నేహితుడు రమణ అతనికి ఫోన్ చేసి చంద్రకళ భయంకరంగా మాట్లాడుతోందని, వెంటనే ఇంటికి వెళ్లాలని చెప్పాడు. దేవేంద్ర హుటాహుటిన ఇంటికి వెళ్లి చూడగా, తలుపులు లోపల నుంచి గడియ పెట్టి ఉన్నాయి. కిటికీలోంచి చూడగా చంద్రకళ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి ఆమెను కిందకు దించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు అంబులెన్స్ వైద్యులు ధృవీకరించారు.
ఇష్టం లేని వివాహమే కారణమా? దర్యాప్తులో పోలీసులు
ఎంబీఏ చదివిన చంద్రకళకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులో నివసిస్తున్న తన స్నేహితుడంటే ఆమెకు ఇష్టముండవచ్చని, ఆమె కాల్ డేటాలో చివరిగా మాట్లాడింది కూడా అతనితోనేనని సమాచారం. అయితే ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతురాలి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
ORR వద్ద బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

