Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ORR వద్ద బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

ORR వద్ద బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

వార్త 2 weeks ago

Gachibowli Car Accident:హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సర్వీస్ రోడ్డుపై శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతివేగంతో పయనిస్తున్న ఒక కారు అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

Read Also : Tragedy in Maharashtra : విషవాయువు పీల్చి 4, 6 ఏళ్ల ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి

 Car crashes into bridge pillar on ORR; two killed.

Gachibowli Car Accident: ఘటన వివరాలు

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కనయ్యలాల్ (25), దేరామ్ (24) హైదరాబాద్ నగరంలో టైల్స్ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి వీరిద్దరూ ఇంద్రారెడ్డి నగర్ నుంచి నానక్‌రామ్‌గూడ వైపు టవేరా కారులో బయలుదేరారు. మార్గమధ్యలో గచ్చిబౌలి సమీపంలోని నియోపోలిస్ బ్రిడ్జి వద్దకు రాగానే, వాహనం తీవ్ర వేగంతో అదుపుతప్పి సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది.

అతివేగమే ప్రమాదానికి కారణం

ఈ ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యి తీవ్రంగా దెబ్బతింది. వాహనంలో ఉన్న ఇద్దరూ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రాయదుర్గం/గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగంగా నడపడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

జీవిత భాగస్వామి మరణిస్తే తక్షణమే 'చేయూత' పింఛన్ మంజూరు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha