Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంచన 4తో సిరీస్‌కు లారెన్స్ ముగింపు పలకనున్నారా?

కాంచన 4తో సిరీస్‌కు లారెన్స్ ముగింపు పలకనున్నారా?

వార్త 2 weeks ago

Kanchana 4: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హారర్ కామెడీ జానర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాఘవ లారెన్స్, తన అభిమానులకు ఒకవైపు తీపి కబురు, మరోవైపు షాకింగ్ న్యూస్ అందించారు.

సుమారు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను భయపెడుతూనే నవ్వించిన ‘ముని/కాంచన’ ఫ్రాంచైజీకి ‘కాంచన 4’తో ముగింపు పలకాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది.

Read Also:Peddhi Movie: పెద్ది మూవీ అమెరికా టికెట్ ధరలు ఖరారు..ప్రీమియర్స్ ఎప్పుడంటే?

Kanchana 4: ఎందుకు ఈ నిర్ణయం?

కేవలం హారర్ కామెడీకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో విభిన్నమైన కథాంశాలతో కొత్త తరహా సినిమాలను రూపొందించాలని, మరో కొత్త సినిమాటిక్ యూనివర్స్‌ను ప్రారంభించాలని లారెన్స్ భావిస్తున్నారట. ఈ సిరీస్‌లో ఇది చివరి చిత్రం కావడంతో, దీనిని మునుపటి భాగాల కంటే అత్యంత భారీ స్థాయిలో, అంతర్జాతీయ నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నారు.

స్టార్ కాస్టింగ్ - పాన్ ఇండియా అపీల్

‘కాంచన 4’లో ఈసారి భారీ తారాగణం నటిస్తోంది. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కీలక పాత్రలో మెరవనుంది. కాంచన సిరీస్ రెగ్యులర్ నటులైన కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ లతో పాటు కామెడీ స్టార్ రెడిన్ కింగ్స్లీ, మీరా రాజ్ నటిస్తున్నారు. లారెన్స్ చిత్రాల్లో ఎప్పుడూ ఒక సున్నితమైన సామాజిక అంశం ఉంటుంది. ఈసారి కూడా ఒక ముఖ్యమైన సోషల్ మెసేజ్‌ను హారర్ ఎలిమెంట్స్‌కు జోడించి, ప్రేక్షకులను ఆలోచింపజేసేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2026 వేసవిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

నేడు రాత్రి 7 గంటలకు ట్రైలర్ రిలీజ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha