Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్ మూడేళ్ల పాలనతోనే అసలైన అభివృద్ధి - సీతక్క

కాంగ్రెస్ మూడేళ్ల పాలనతోనే అసలైన అభివృద్ధి - సీతక్క

వార్త 2 weeks ago

Sathupally : దేశాభివృద్ధి మరియు సమాజ పురోగతి కోసం మహిళలు ఎంతో కష్టపడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

సత్తుపల్లి పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. గత 10 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే చేసి చూపించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలనేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమని, ఈ బృహత్తర సంకల్పానికి ప్రజలందరి ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.

ఆడవాళ్లంటే అబల కాదు ఆదిపరాశక్తి: ఎమ్మెల్యే మట్టా రాగమయి

ప్రజా పాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించిన “ఇందిరా మహిళా శక్తి సదస్సు”లో మంత్రి సీతక్కతో కలిసి ఎమ్మెల్యే మట్టా రాగమయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… “ఆడవాళ్లంటే అబల కాదు, ఆదిపరాశక్తి” అని మంత్రి సీతక్క తన పనితీరుతో నిరూపించారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్వచ్ఛంగా జరుగుతున్న అభివృద్ధి మరియు ప్రజలకు నేరుగా అందుతున్న సంక్షేమ పథకాలు ప్రతిపక్ష నాయకుల కళ్లకు కనిపించడం లేదా అని ఆమె తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

కొండా సురేఖ బిగ్ అప్‌డేట్.. తెలంగాణ రాజకీయాల్లో రచ్చ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha