Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొండా సురేఖ బిగ్ అప్‌డేట్.. తెలంగాణ రాజకీయాల్లో రచ్చ!

కొండా సురేఖ బిగ్ అప్‌డేట్.. తెలంగాణ రాజకీయాల్లో రచ్చ!

వార్త 2 weeks ago

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో కొండా కుటుంబం వేస్తున్న అడుగులు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

"ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలో నిర్ణయం ప్రకటిస్తా" అంటూ ఆమె పెట్టిన "బిగ్ అప్‌డేట్" పోస్ట్‌తో ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదా అన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఇటీవల మంత్రివర్గం నుంచి ఆమెను తప్పించిన తర్వాత రాజీనామా చేయనని చెప్పినప్పటికీ, సురేఖ ప్రస్తుత పోస్ట్ మరియు ఆమె భర్త కొండా మురళి ప్రదర్శిస్తున్న దూకుడుతో కొండా దంపతులు తమ నిర్ణయాన్ని పునరాలోచించుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.

Read Also :Konda Surekha's Political Career : కొండా సురేఖ రాజకీయ జీవితం

Konda Surekha: కొండా కుటుంబం నెక్స్ట్ స్టెప్ ఏంటి? బీఆర్‌ఎస్, బీజేపీనా లేక ఉప ఎన్నికనా?

  • కాంగ్రెస్‌లో అసంతృప్తి: మంత్రి పదవి ఊడటంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కొండా దంపతులు తమ తదుపరి రాజకీయ భవిష్యత్తుపై అనుచరులు, మద్దతుదారులతో వరుస సమాలోచనలు జరుపుతున్నారు.
  • బీఆర్‌ఎస్ తలుపులు బంద్?: 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్, కేటీఆర్‌లపై కొండా దంపతులు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో, వారికి బీఆర్‌ఎస్ నాయకత్వంతో సయోధ్య కుదిరే అవకాశాలు దాదాపు లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
  • బీజేపీలో భిన్నాభిప్రాయాలు?: కొండా కుటుంబం బీజేపీ వైపు చూస్తోందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఆ పార్టీ నుంచి అధికారిక ఆహ్వానం అందలేదని సమాచారం. అలాగే వారి చేరికపై కమలం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
  • ఉప ఎన్నికలే ‘ప్లాన్ బీ’నా?: ఇటీవల కొండా మురళి మీసం తిప్పుతూ సవాల్ విసరడం, సురేఖ పోస్ట్ వెనుక ఉన్న వ్యూహాన్ని పరిశీలిస్తే.. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లడమే వారి 'ప్లాన్ బీ' (Plan B) నా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

గతంలో వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచి సంచలన నిర్ణయాలు తీసుకున్న చరిత్ర కొండా సురేఖకు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రకటించబోయే ఆ “బిగ్ అప్‌డేట్” ఏంటనేది వెల్లడయ్యే వరకు ఈ రాజకీయ ఊహాగానాలకు తెరపడేలా లేదు.

రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై సంచలన ఆరోపణలు.. 'తెలుగు స్క్రైబ్'పై సైబర్ క్రైమ్ కేసు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha