Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్.. సిరిసిల్ల వేదికగా ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్.. సిరిసిల్ల వేదికగా ఘాటు వ్యాఖ్యలు

వార్త 14 hrs ago

KTR: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

సిరిసిల్లలో శనివారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనలోని లోపాలను ఎండగడుతూనే, రాబోయే రోజుల్లో గులాబీ దళం ఏకీకృత వ్యూహంతో ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 KTR Sircilla Speech

Read also: Nagarkurnool Crime: భర్త మందలించాడని.. ప్రియుడితో కలిసి వివాహిత బలవన్మరణం

నేతన్నల ఉపాధిని దెబ్బతీశారు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనతో ఉన్న వ్యక్తిగత, రాజకీయ విభేదాలను మనసులో పెట్టుకుని సిరిసిల్ల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులను, స్థానిక పరిశ్రమలను ఇబ్బంది పెట్టవద్దని కేటీఆర్ హితవు పలికారు. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించిన బతుకమ్మ చీరల ఆర్డర్లను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. దీనివల్ల ఇక్కడి చిన్న తరహా టెక్స్‌టైల్ పరిశ్రమలు, చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, రైతులకు సంబంధించి కనీసం ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన గన్నీ బ్యాగులను కూడా ప్రభుత్వం సమకూర్చలేకపోయిందని, ఉన్న సంచులను ఇతర అవసరాలకు తరలించారని ఆరోపించారు.

KTR: హామీల అమలు శూన్యం.. ప్రశ్నిస్తే కేసులు!

కాంగ్రెస్ పార్టీ అధికార పీఠం దక్కించుకుని ఇన్ని రోజులవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క ప్రధాన వాగ్దానాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేకపోయిందని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మళ్లీ కేసీఆరే మన సీఎం.. 119 స్థానాల్లో గెలుపే లక్ష్యం!

భవిష్యత్ ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖచిత్రంగానే మనం ప్రజల్లోకి వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాధించి, అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా ప్రతీ ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha