Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?! సోనియా గాంధీ బంపర్ ఆఫర్?

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?! సోనియా గాంధీ బంపర్ ఆఫర్?

వార్త 2 months ago

TMC-Congress : పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) చుట్టూ జాతీయ రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. గత 28 ఏళ్ల టీఎంసీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పార్టీ నిలువునా చీలిపోయే ప్రమాదంలో పడటంతో, మమతా బెనర్జీ ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్‌తో చేతులు కలపబోతున్నారనే వార్తలు జాతీయ మీడియాలో మార్మోగిపోతున్నాయి.

ఏకంగా కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగి విలీన ప్రతిపాదనను మమత ముందు ఉంచినట్లు బలమైన కథనాలు వస్తున్నాయి.

Read Also: RBI new rules: NIRలకు గుడ్ న్యూస్.. ఎఫ్‌సీఎన్‌ఆర్ డిపాజిట్లపై భారీగా పెరిగిన వడ్డీ రేట్లు!

 TMC-Congress

సోనియా గాంధీ స్కెచ్.. మమతకు, అభిషేక్‌కు కీలక పదవుల ఆఫర్!

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీపై భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి పెరుగుతున్న రాజకీయ, దర్యాప్తు సంస్థల ఒత్తిడిని గమనించిన సోనియా గాంధీ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష కూటమి బలోపేతం అవ్వడమే కాకుండా, బీజేపీ విసిరే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సోనియా భావిస్తున్నారు. ఈ విలీన ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ అధిష్ఠానం మమతా బెనర్జీకి జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిని, ఆమె మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీకి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి అత్యంత కీలకమైన పదవులను ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

TMC-Congress : అంతా అబద్ధం, అవన్నీ వదంతులే: టీఎంసీ క్లారిటీ

అయితే, కాంగ్రెస్‌లో తృణమూల్ కాంగ్రెస్ విలీనం కాబోతోందనే వార్తలను టీఎంసీ ఉన్నత స్థాయి వర్గాలు తీవ్రంగా ఖండించాయి. రాహుల్ గాంధీ, అభిషేక్ బెనర్జీ మధ్య జరిగిన గంటన్నర చర్చల్లో ఎక్కడా విలీనం ప్రస్తావన రాలేదని, మీడియాలో వస్తున్నవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశాయి. మరోవైపు మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ సరికొత్త బాంబు పేల్చారు. కాంగ్రెస్‌లో విలీనం వార్తలను తోసిపుచ్చుతూ.. “తమ తిరుగుబాటు వర్గమే అసలైన టీఎంసీ” అని ఆయన ప్రకటించుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

టీఎంసీ కార్యదర్శి అభిషేక్‌పై ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ తీవ్ర విమర్శలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha